నెల రోజుల్లోనే ఇండియాలో కరోనా మందు…!

-

కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు అన్నీ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ కోసం ఇప్పుడు చాలా దేశాల్లో పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. మన దేశంలో వ్యాక్సిన్ కోసం పెద్ద ఎత్తున ప్రయోగాలు చేస్తున్నారు. మన దేశంలో అత్యున్నతమైన పరిశోధన, అభివృద్ది సంస్థ సీఎస్ఐఆర్ (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసర్చ్) ప్రస్తుతం కరోనా వైరస్‌ కోసం మందు కనుక్కునే ప్రయత్నాలు చేస్తుంది.

మరిన్ని ప్రయోగాలు చేయడానికి గానూ డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతులు తీసుకుంది. అన్నీ అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే నెల రోజుల్లో వ్యాక్సిన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. కాడిలా ఫార్మాసిటికల్స్‌కు చెందిన Sepsivac మీద ఇప్పుడు పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ రెండు సంస్థలు గత కొన్నాళ్ళు గా పని చేస్తున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా సీఐఎస్ఆర్ కీలక పరిశోధనలు చేస్తోంది.

ఇమ్యునోథెరపీ ట్రీట్‌మెంట్‌‌కు ప్రాథమికంగా డ్రగ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఢిల్లీ ఎయిమ్స్‌, భోపాల్ ఎయిమ్స్, మరోచోట 50 మంది పేషెంట్ల మీద పరిక్షలు చేసారు. 30 రోజుల్లో దీనికి సంబంధించిన ఫలితాలు వస్తాయని, అనంతరం ఫేజ్ 3 లో ట్రయల్స్ నిర్వహిస్తారు. ఈ ప్రక్రియ అంతా కూడా నెల రోజులలో పూర్తి అయ్యే సూచనలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news