ప్రపంచంలో అతి తక్కువ.. కరోనా మరణాల్లో భారత్ రికార్డ్..!

-

ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కరోనా మరణాలటు పోలిస్తే భారత్‌లో నమోదైన కరోనా మరణాలు అతి తక్కువ అని, ఇది నిజంగానే ఒక రికార్డ్ అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ, దేశంలో కరోనా రికవరీ రేటు 75 శాతానికి పైనే ఉందని తెలిపారు. అలాగే ఇప్పటివరకు మరణాల రేటు 1.58 శాతం మాత్రమే నమోదైందని తెలిపారు. గత 24 గంటల్లో యాక్టివ్ కేసులు 6,400కు తగ్గాయని, మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 22.2 శాతం మాత్రమేనని భూషణ్ తెలిపారు.

అదేవిధంగా కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసుల్లో కేవలం 2.7శాతం మందే ఆక్సిజన్‌ సపోర్ట్‌తో ఉన్నారని, 1.29 శాతం మంది రోగులు ఐసీయూలో ఉండగా, 0.29 శాతం మంది వెంటిలేటర్‌పై ఉన్నారని భూషణ్‌ వెల్లడించారు. ఇకపోతే అన్‌లాక్‌ 4.0లో స్కూల్స్ కు మినహాయింపు ఉంటుందని అంతా భావించినప్పటికి.. ఇందుకు కేంద్ర హోమ్ శాఖ నో చెప్పినట్టు రాజేష్ భూషణ్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news