INDvsPAK మ్యాచ్… అమ్మో ఒక్క టికెట్ ధర అన్ని లక్షలా..

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసిన వెంటనే T20 ప్రపంచకప్‌ మొదలవనుందన్న విషయం తెలిసిందే.జూన్‌ 2 నుంచి 29 వరకూ జరిగే మెగా టోర్నీ కి అమెరికా, వెస్ట్ ఇండీస్ ఆథిత్యం ఇవ్వనున్నాయి. ఈ టోర్నీ కోసం ఇప్పటికే అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈ టోర్నీలో టీమిండియా ఏ దేశంతో తలపడినప్పటికీ కూడా పాకిస్తాన్తో మ్యాచ్ అంటే అందరూ ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇక భారత్, పాకిస్తాన్ మధ్యన జూన్ 9న జరగబోయే మ్యాచ్ల టికెట్ ధర చూస్తుంటే మతి పోయేటట్టు ఉంది.

టీ20 వరల్డ్ కప్లో టికెట్ల ధరలపై ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ మండిపడ్డారు. ఐసీసీ తీరును ఆయన తప్పుబట్టారు. ‘జూన్ 9న ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ కోసం డైమండ్ క్లబ్ టికెట్ ధర చూసి షాక్ అయ్యా. ఒక్కో టికెట్ 20 వేల డాలర్ల(రూ.16.6 లక్షలు) కు విక్రయిస్తున్నారు. అమెరికా ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నది లాభాల కోసం కాదు. గేమ్ విస్తరించడానికి. మామూలు టికెట్ ధర కూడా 2,750 డాలర్లు ఉండటం దారుణం’ అని ఆయన ట్వీట్ చేశారు

Read more RELATED
Recommended to you

Latest news