ఈడీ కస్టడీలో ఉన్న మంత్రి ముఖంపై గాయం.. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన కేజ్రీవాల్

-

మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ ఈడీ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మంత్రి ఫోటో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ ఫోటో చూస్తే పలు అనుమానాలు దారి తీస్తోంది. కారులో ఉన్న మంత్రి ముఖంపై రక్తపు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. దీంతో ఆయన గాయపడినట్లు కనిపిస్తోంది. ఈ ఫోటో చూసిన ఆప్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఘాటుగా స్పందించారు.

మంత్రి సత్యేందర్ జైన్
మంత్రి సత్యేందర్ జైన్

ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఈడీ కస్టడీలో ఉన్న మంత్రిపై ఎవరైనా చేయి చేసుకున్నారా..? అనే విషయంపై స్పష్టత లేదన్నారు. ఒకవేళ అతడిపై చేయి చేసుకుంటే సీరియస్ యాక్షన్ తీసుకుంటామన్నారు. మంత్రిని నేరుగా కలవలేదన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆయన పరిస్థితి మెరుగుపడ్డాక అతడిని కలుస్తానని చెప్పారు. కాగా, ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఫోటోలు చూసిన పలువురు బీజేపీ, ఈడీపై మండిపడ్డారు. బీజేపీ, ఈడీ అధికారులను దేవుడు క్షమించడంటూ ఆరోపించారు. తప్పు చేయని వారిని శిక్షిస్తున్నారని వారు మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news