మాట్రిమోనిలో పరిచయం.. పెళ్లి చేసుకుంటానని రూ.10 లక్షలు టోకరా..!!

-

విదేశాల్లో ఉంటానని చెప్పి ఓ వ్యక్తి హైదరాబాద్‌కు చెందిన యువతిని మోసం చేశాడు. మాట్రిమోని ద్వారా పరిచయమై.. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆమె దగ్గరి నుంచి రూ. 10 లక్షలు కాజేసి.. పారిపోయాడు. దీంతో మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

పెళ్లి-మోసం
పెళ్లి-మోసం

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  విదేశాల్లో ఉంటానని ఓ వ్యక్తి హైదరాబాద్ ఓల్డ్ బోయిన్‌పల్లికి చెందిన యువతితో మాట్రిమోని ద్వారా పరిచయం అయ్యాడని పేర్కొన్నారు. యూకేలోని స్కాట్‌ల్లాండ్‌లో ఉంటానని, తన పేరు కృష్ణ కుమార్ అని తెలిపాడన్నారు. ఈ మేరకు బాధితురాలిని నమ్మించి ప్రేమలోకి లాగాడని, ఇండియాకు వచ్చి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడని అన్నారు. ఈ మేరకు ఇండియాకు వస్తున్నానని.. ఎయిర్‌పోర్టులో అధికారులు తన లగేజీని సీజ్ చేసినట్లు.. రూ.10 లక్షలు పంపించమని తెలిపాడు.

దీంతో బాధితురాలు రూ.10 లక్షలు తన అకౌంట్‌కు పంపించింది. డబ్బులు చేతికి అందడంతో మోసగాడు తన విశ్వరూపం చూపించాడు. దీంతో బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఢిల్లీకి చెందిన నల్ల జాతీయుడు కార్బల్ ఎడిమాండో అనే వ్యక్తి మోసం చేసినట్లు గుర్తించారు. ఈ మేరకు ఆ మోసగాడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news