స్ఫూర్తి: తేనె వ్యాపారంతో కోట్లు సంపాదిస్తున్న దంపతులు…!

-

చాలామంది వ్యాపారాలను చేస్తూ మంచిగా డబ్బులు సంపాదిస్తున్నారు. మీరు కూడా మంచిగా వ్యాపారాన్ని చేసి డబ్బులను పొందాలనుకుంటున్నారా అయితే వీరిని మీరు ఆదర్శంగా తీసుకోవచ్చు. చాలా మంది వ్యాపారం చేయాలన్న డబ్బులు దాని ద్వారా సంపాదించాలన్న భయపడుతూ ఉంటారు కానీ అటువంటి వాళ్ళందరికీ వీళ్ళు స్ఫూర్తిగా నిలిచారు.

వ్యాపారం చేస్తూ ఈ దంపతులు కోటీశ్వరులుగా మారిపోయారు ఇక మరి పూర్తి వివరాలు చూసేద్దాం. హిమాన్షు మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఒక కంపెనీలో పని చేస్తున్నారు ఆయన భార్య కూడా ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. అయితే ఇలా ఉద్యోగాలు చేసిచేసి వాళ్ళు విసిగిపోయారు. దీనితో సేంద్రియ వ్యవసాయాన్ని మొదలుపెట్టారు. పురుగుల మందుల కోసం చూస్తున్న వాళ్లు తేనెటీగల పెంపకంపై దృష్టి పెట్టారు.

దీనిని పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు చక్కగా దీనిని అనుసరిస్తే ఎక్కువ డబ్బులు పొందొచ్చని వాళ్ళు తెలుసుకోవడం జరిగింది. హిమాన్షు తన భార్య ఇద్దరూ కూడా వాళ్ళ సొంత భూమిలో హానీ ఫామిలీ మొదలుపెట్టారు. మొదట కొంచెం తేనెను తయారు చేయడం మొదలుపెట్టారు క్రమంగా వ్యాపారాన్ని విస్తరించుకున్నారు.

అయితే వాళ్ల పొలానికి సమీపంలో ఉంటే పొలాల్లో కెమికల్స్ ను ఉపయోగించడం వల్ల వీళ్ళ తేనెటీగలు చనిపోయాయి దీంతో వారికి మూడు లక్షల రూపాయలు నష్టం వచ్చింది. తర్వాత రైతులను కెమికల్స్ ఉపయోగించ వద్దని తెలిపారు. వీరి తేనే ఫార్మ్ కి దగ్గర ఉండే రైతులందరూ కూడా కెమికల్స్ ని వాడడం మానేశారు తర్వాత వీళ్ళ బిజినెస్ బాగా సాగింది.

నెలకి కనీసం మూడు వందల కిలోల వరకు తేనెని ఉత్పత్తి చేస్తున్నారు. దీంతో తొమ్మిది లక్షల నుండి 12 లక్షలు వస్తుంది అంటే ఏడాదికి కోట్ల లాభం వస్తుంది. చూశారు కదా ఉద్యోగాన్ని కాదనుకుని నచ్చిన వ్యాపారంలోకి వచ్చి.. ఈ దంపతులు ఎలా దూసుకుపోయారో. ఎప్పుడు కూడా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలంటే మొదట ప్రయత్నం చేయాలి ఆ తర్వాత ప్రతి ఒక్కరు వారి మీద వారు నమ్మకం పెట్టుకుంటే సాధించడానికి అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news