ఫేక్ కరెన్సీ ముఠా గుట్టును రట్టు చేసిన మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు

-

ఫేక్ కరెన్సీ ముఠా గుట్టును రట్టు చేశారు మాదాపూర్‌ ఎస్ఓటి పోలీసులు. వారి వద్ద నుండి లక్ష రూపాయల ఫేక్ కరెన్సీని సీజ్ చేశారు. ఫేక్ కరెన్సీ నోట్లు ప్రింట్ చేయడానికి ఓ లాప్ టాప్, రెండు ప్రింటర్లు, గాంధీ ఎంబ్లేమ్ స్టాంపులు, గ్రీన్ పెన్లు, కటర్ తో పాటు ఆరు మొబైల్ ఫోన్లు సీజ్ చేశారు.

అత్తాపూర్ లోని ఫై ఎలక్ట్రానిక్ స్టోర్స్ లో ప్రింటర్లు కొనుగోలు చేశారు. ఓ వ్యక్తి ద్వారా గాంధీ ఎంబ్లేమ్ తయ్యారి చేయించారని.. యూ ట్యూబ్ లో చూసి నకిలీ కరెన్సీని తయ్యారికి ముఠా సభ్యులు తెరలేపారని వెల్లడించారు. 5 మంది తో కూడిన ముఠా సభ్యులని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. “తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశం తో నకిలీ కరెన్సీ తయ్యారికి పథకం రచించాడు A1 నిందితుడు ఆదామ్. కాటేదాన్ లోని రద్దీ ప్రాంతం లో నకిలీ కరెన్సీ చలామణికి యత్నం.

విశ్వసనీయ సమాచారం మేరకు మాటు వేసి పట్టుకున్నారు మాదాపూర్ ఎస్ఓటి బృందం. ఆదామ్, భరత్ కుమార్, శంకర్, మాధవ గౌడ్, మణికంఠ నాయుడి పై 489 సెక్షన్ కింద కేసు నమోదు చేసి కటకటాలకు తరలించారు.లారీ, ఆటో డ్రైవర్లు గా పని చేస్తూ ఫేక్ కరెన్సీ తయ్యారి కి స్కెచ్. ఇంజాపూర్ ని అడ్డాగా చేసుకొని ఫేక్ కరెన్సీ తయ్యారి” కి పాల్పడ్డారని తెలిపారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news