క్రికెట్ ప్రేమికులకు షాకింగ్ న్యూస్. ఐపీఎల్ 2022; మళ్ళీ కరోనా కలకలం సృష్టించింది.గత ఏడాది కూడా ఇలాగే నలుగురు ప్లేయర్స్ కి కరోనా రావడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ వాయిదా పడింది.మళ్లీ ఈ ఏడాది కూడా కరోన ఐపీఎల్ ని వదిలి పెట్టేలా లేదు.నేడు ఐపీఎల్ 2022: 26 వ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కత్తా నైట్ రైజర్స్ తలపడనున్నాయి.కాగా ఈ సందర్భంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కరోనా కలకలం రేగింది.ఢిల్లీ క్యాపిటల్స్ ఫిజియో ప్యాట్రిక్ ఫర్హాట్ కరోన బారినపడ్డారు.
దీంతో అతడిని ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.ఇతర సిబ్బందితో సిబ్బందితోపాటు ఆటగాళ్లకు కూడా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు.కాగా రేపు ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తో తలపడనుంది.ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కరోనా మాత్రం ఏదో ఒక రూపంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను మాత్రం వెంటాడుతూనే ఉంది.