వాళ్లను వదిలిపెట్టొద్దు.. సూసైడ్ నోట్‌లో ఇంటర్ విద్యార్థి సాత్విక్

-

రంగారెడ్డి జిల్లా నార్సింగిలోని శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే సాత్విక్ జేబులో పోలీసులు సూసైడ్‌ నోట్‌ను గుర్తించారు. ‘‘ అమ్మా నాన్న.. నేను ఈపని చేస్తున్నందుకు క్షమించండి. మిమ్మల్ని బాధ పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు. ప్రిన్సిపల్‌, ఇన్‌ఛార్జి, లెక్చరర్ల వల్లే చనిపోతున్నా. కృష్ణారెడ్డి, ఆచార్య, శోభన్‌, నరేశ్‌ వేధింపులు తట్టుకోలేకపోతున్నా. ఈ నలుగురు హాస్టల్‌లో విద్యార్థులకు నరకం చూపిస్తున్నారు. నన్ను వేధించిన ఆ నలుగురిని వదిలిపెట్టొద్దు.. చర్యలు తీసుకోండి. అమ్మా, నాన్న లవ్‌ యూ, మిస్‌ యూ ఫ్రెండ్స్‌’’ అని సాత్విక్‌ సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు.

సాత్విక్‌ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరో వైపు ఇంటర్‌ బోర్డు కార్యాలయం వద్ద  యువజన కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. బోర్డును ముట్టడించేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. వారిని అడ్డుకునే క్రమంలో పోలీసులు, ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. విద్యార్థుల ఆత్మహత్యలను ఇంటర్‌ బోర్డు పట్టించుకోవట్లేదని యువజన కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news