Telangana : విద్యార్థులకు గుడ్ న్యూస్.. డైట్‌ ఛార్జీల పెంపునకు ప్రభుత్వ నిర్ణయం

-

తెలంగాణలోని హాస్టల్ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సంక్షేమ వసతి గృహాల్లో డైట్ ఛార్జీలను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయమై అధికారులతో మంత్రులు హరీశ్‌ రావు, సత్యవతి రాఠోడ్, గంగుల కమలాకర్ సమావేశమై ఈ విషయంపై చర్చించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సంబంధిత శాఖల అధికారులు సమావేశానికి హాజరయ్యారు.

డైట్ ఛార్జీలను పెంచాలని నిర్ణయించి అందుకు అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 3 నుంచి ఏడో తరగతి వరకు రూ.1200, 8 నుంచి పదో తరగతి వరకు రూ.1,400, ఇంటర్ విద్యార్థులకు రూ.1,875లకు పెంచాలని ప్రతిపాదించారు. 25 శాతానికి పైగా డైట్ ఛార్జీలు పెంచాలని ప్రతిపాదించిన మంత్రులు.. వాటిని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదించారు. మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, కర్ణాటక తదితర రాష్ట్రాలకన్నా తెలంగాణలోనే డైట్ ఛార్జీలు అధికంగా ఉన్నాయని మంత్రులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కు పెద్దపీట వేస్తోందని మంత్రులు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news