బాబు అస్స‌లు మార‌లేదుగా.. మారితే బాబెందు క‌వుతారు…!

-

రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థుల‌పై విమ‌ర్శ‌లు చేయాల్సిందే. అయితే, ఆ విమ‌ర్శ‌లు న‌లుగురూ మెచ్చుకునేలా , ఆలోచింపచేసేలా ఉండాలి. కానీ, ఇలాంటి విమ‌ర్శ‌లు కూడా చేయొచ్చా? అనే కోణంలో చేయ‌డ‌మే ఇప్పు డు చ‌ర్చ‌కు కార‌ణ‌మైంది. అధికార వైసీపీ నేత‌ల‌పై టీడీపీ నేత‌లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న విష‌యంలో తె లిసిందే. కార‌ణం ఏదైనా కూడా ఏదో ఒక విమ‌ర్శ చేస్తున్నారు. విశాఖ‌లో క‌రోనా కేసులు లేవ‌ని ప్ర‌భుత్వం చెబితే.. నువ్వు విశాఖ‌ను రాజ‌ధానిగా ఎంచుకున్నావు కాబ‌ట్టే.. అక్క‌డ కేసులు దాస్తున్నావంటూ.. టీడీపీ విమ‌ర్శించింది అయితే, దీనిని విశాఖ వాసులే తిప్పికొట్టారు. ఇంత చౌక‌బారు విమ‌ర్శ‌లు ఎందుకు బాబూ.. మేం కూడా క‌ర‌నా భారిన ప‌డాల‌ని కోరుతున్నారా? అంటూ సోష‌ల్ మీడియాలో కామెంట్లు పెట్టారు.

ఆ త‌ర్వాత క‌రోనా టెస్టింగ్ కిట్ల విష‌యంలోనూ ప్ర‌భుత్వంపై అవినీతి ఆరోప‌ణ‌లు చేయాల‌ని టీడీపీ ప్ర‌య ‌త్నించింది. భారీ ఎత్తున జ‌గ‌న్ ప్ర‌జాధ‌నాన్ని నొక్కేశాడ‌ని ఆరోపించారు. అయితే, ఈ విష‌యంలో కిట్ల ధ ర‌ల‌కు సంబంధించి కేంద్ర‌మే ఓ నోట్ విడుద‌ల చేసింది. దీంతో టీడీపీ చేసిన విమ‌ర్శ‌ల్లో ప‌స‌లేద‌ని అర్ధ ‌మై.. అంద‌రూ మౌనం వ‌హించారు. అదేస‌మ‌యంలో నిన్న మొన్న‌టి వ‌ర‌కు క‌రోనా టెస్టులు స‌రిగా చేయ‌డంలేద‌ని… అందుకే రాష్ట్రంలో కేసుల సంఖ్య త‌క్కువ‌గా ఉంద‌ని బాబు ఆరోపించారు. ఇప్పుడు దేశంలోనే ఎక్కువ టెస్టులు చేస్తున్న రాష్ట్రం ఏపీనేన‌ని కేంద్రంలోని ఆరోగ్య శాఖే వెల్ల‌డించింది. దీంతో బాబు చేసిన ఆరోప‌ణ గాలికికొట్టుకుపోయింది.

తాజాగా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంపైనా టీడీపీ నేత‌లు విమ‌ర్శ‌లు గుప్పించారు. టీటీడీ బోర్డు చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి లాక్‌డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించార‌ని, ఆయ‌న కేసులు పెట్టాల‌ని డిమాండ్ చేశారు. అయితే, వాస్త‌వానికి ఆయ‌న టీటీడీ బోర్డు చైర్మ‌న్ ఈ హోదాలో ఆయ‌న ఎప్పుడైనా ఎక్క‌డైనా తిరుమ‌ల‌లో ప‌ర్య‌టించే రైట్ ఉంది. అదేవిధంగా ఆయ‌న వెంట ఆయ‌న భార్య‌, త‌ల్లిని కూడా ఆల‌యంలోకి తీసుకువెళ్లే అవ‌కాశం ఉంది. ఇది నిబంధ‌న‌లను ఎలా ఉల్లంఘించిన‌ట్టో టీడీపీ నేత‌ల‌కే తెలియాలి.

రాష్ట్రంలో ప్ర‌భుత్వం మారిపోయిన త‌ర్వాత కూడా టీటీడీ బోర్డు చైర్మ‌న్ ప‌ద‌వికి తాను రాజీనా మా చేయ‌న‌ని, ఇది దేవుడు ఇచ్చిన ప‌ద‌వి అని ఆయ‌నే వ‌చ్చి త‌ప్పిస్తే.. త‌ప్ప‌తాను రాజీనామా చేయ‌న‌ని చెప్పిన టీడీపీ నాయ‌కుడి ఉదంతాన్ని మ‌రిచిపోయిన‌.. త‌మ్ముళ్లు.. ఇప్పుడు అన‌వ‌స‌రంగా అచ్చిబుచ్చి విమ‌ర్శ‌ల‌తో పొద్దు పుచ్చుతున్నార‌నే వాద‌న స‌ర్వ‌త్రా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Read more RELATED
Recommended to you

Latest news