టీడీపీలో హుషారెత్తిస్తున్న బాబు ప్ర‌క‌ట‌న‌

-

ఇప్ప‌టికే అన్ని విధాలా త‌ల‌బొప్పి క‌ట్టి ఉన్న టీడీపీలో ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబు తాజాగా చేసిన ప్ర‌క‌ట న జోష్ పెంచుతుందా? ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో అతి త‌క్కువ మందిమాత్ర‌మే ఉన్నారా? అని అనిపించే ఉన్న టీడీపీలో మ‌ళ్లీ పాత క‌ళ సంత‌రించుకుంటుందా?  అంటే.. కొంద‌రు రాజ‌కీయ విశ్లేష‌కులు ఔన‌నీ, మ‌రికొంద‌రు మాత్రం కాద‌ని అంటున్నారు. దీంతో తాజాగా బాబు చేసిన ప్ర‌క‌ట‌న‌పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోం ది. కేవలం ఏడాది కాలంలో టీడీపీ తీవ్రంగా దెబ్బ‌తిన్న విష‌యం తెలిసిందే. గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల‌కు ముందు ఎక్క‌డ చూసినా.. సైకిల్ జోరు క‌నిపించింది. ప‌చ్చ జెండా రెప‌రెప‌లు క‌నిపించాయి.

కానీ, ఎన్నిక‌ల్లో ఒకే ఒక్క ఓట‌మి.. అది కూడా ఘోర‌మైన ఓట‌మి ఎదురు కావ‌డంతో చంద్ర‌బాబు ప‌రిస్థితి, పా ర్టీ ప‌రిస్థితి కూడా దారుణంగా త‌యారైంది.  ఎక్క‌డిక‌క్క‌డ నాయ‌కులు చెల్లాచెదుర‌య్యారు.  వివిధ పార్టీల్లోకి జంప్ చేసేశారు. ఇక‌, ఉన్న‌వారిలోనూ ఎవ‌రికివారే య‌మునాతీరే అన్న‌ట్టుగా రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి. చంద్ర‌బాబుకు అత్యంత విధేయులమ‌ని చెప్పుకొన్న నాయ‌కులు, ఆయ‌న ఇచ్చిన ప‌ద‌వులు అనుభ‌వించిన నాయ‌కులు కూడా పార్టీ ఓట‌మితో జెండా మార్చేశారు. అదేస‌మ‌యంలో కొంద‌రు గెలిచిన నాయ‌కులు కూడా పార్టీని వీడ‌డంతో స‌ద‌రు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ పార్టీని మోసేవారు, న‌డిపించేవారు క‌రువ‌య్యారు.

దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్ర‌బాబు మాట‌ను వినే నాయ‌కుడు, పార్టీకోసం ప‌నిచేసే నాయ‌కుడు క‌ని పించ‌లేదు. పోనీ.. ఖాళీ అయిన స్థానాల్లో ఎవరికైనా ప‌గ్గాలు అప్ప‌గించారా? అంటే అది కూడాలేదు. దీం తో కొన్ని చోట్ల అంటే రాజాం, శ్రీకాకుళం, గుంటూరు వెస్ట్ వంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు ఉన్నా నిర్లి ప్తంగా ఉన్నారు. చంద్ర‌బాబు పిలుపు ఇచ్చిన ఏ ప‌నినీ వారు ప‌ట్టించుకోవ‌డం లేదు. ఈనేప‌థ్యంలో చంద్ర‌బాబు తాజాగా చేసిన ప్ర‌క‌ట‌న వారిలో ఉత్సాహం నింపింద‌ని అంటున్నారు. ఈ నెల ఆఖ‌రులో మ‌హానాడును నిర్వ‌హించ‌నున్నారు. ఇది ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించే కార్య‌క్ర‌మం.

ఇది ముగిసిన త‌ర్వాత జిల్లా స్థాయి, మండ‌ల స్థాయిలో పార్టీ నాయ‌క‌త్వానికి ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్టు చంద్ర‌బాబు తాజాగా ప్ర‌క‌టించారు. దీంతో రేసులో ఉన్న నాయ‌కులు ఉత్సాహంగా ఉన్నారు. అయితే, అస‌లు నాయ‌కులే లేన‌ప్పుడు ఎన్నిక‌లు ఎందుకు?  పార్టీని న‌మ్ముకుని ఉన్న వారికి ప‌ద‌వులు ఇచ్చేయ‌క‌! అని పెద‌వి విరుస్తున్న‌వారు కూడా క‌నిపిస్తున్నార‌ని అంటున్నారు. మొత్తంగా చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న పార్టీలో జోష్ నింపేదేన‌ని చెబుతున్నారు త‌ట‌స్థులు! మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news