రాష్ట్రంలో ఎన్నికలు పూర్తయి ఏడాది పూర్తయిన విషయం రాష్ట్రంలో అందరికీ గుర్తుంది కానీ.. టీడీపీ అధి నేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లకు మాత్రం ఎక్కడా గుర్తున్నట్టు లేదనే వ్యాఖ్యలు వినిపి స్తు న్నాయి. తాజాగా ఈ ఇద్దరు కూడా జగన్ ప్రభుత్వంపై విమర్శలకు దిగారు. ఇందులో కొత్తేముంది? అంటారా .. అక్కడికే వస్తున్నా.. వాస్తవానికి ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు ఆయన బృందం జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉంది. అయితే, తాజాగా చేసిన విమర్శల్లో మేం అధికారంలో ఉండి ఉంటే.. ఇది .. మా ప్రభుత్వమే అయితే.. అంటూ ఇద్దరూ కూడబలుక్కుని రాగాలు తీశారు.
తాజాగా జగన్ సర్కారు రైతు భరోసా పేరుతో మరోసారి రైతులకు సాయం చేసేందుకు ముందుకు వచ్చిం ది. మొత్తం 13500లను రైతుల ఖాతాలో వేయనుంది. దీనిలో 6000లను కేంద్రం ఇస్తుండగా.. మిగిలిన మొత్తం రాష్ట్రం ఇస్తోంది. అయితే, రైతు భరోసా మొత్తం కూడా జగనే ఇస్తానని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి ఇ ప్పుడు ఒక్కొక్క రైతుకు ఆయన పాతిక వేలచొప్పున టోకుగా లక్షల్లో టోపీ పెడుతున్నాడంటూ.. తండ్రీ కుమారులు ఇద్దరూ కూడా తీవ్రస్థాయిలో విమర్శించారు. అంతటితో ఆగకుండా.. అదే మేం అధికారంలో ఉండి ఉంటే.. అంటూ.. కొన్ని లెక్కలు వల్లించారు.
టీడీపీ అధికారంలో ఉండి ఉంటే.. మేం రైతుకు 1.15 లక్షలు ఇచ్చేవారిమని, దీనిలో భరోసా కింద 75 వేలు.. మిగిలిన సొమ్మును రుణమాఫీ కింద జమేసేవారమని చంద్రబాబు, లోకేష్ లు వల్లించారు. కానీ, ఏడాది కిందటి వరకు కూడా వీరు అధికారంలోనే ఉన్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో రైతులకు ఏమేరకు రుణమాఫీ చేశారు. ఇది 2014 ఎన్నికల సమయంలో టీడీపీ అధినేతగా చంద్రబాబు రైతులకు ఇచ్చిన హామీనే! దీనిని సంపూర్ణంగా అమలు చేయలేని చంద్రబాబు, ఇప్పుడు మేం ఉంటే.. అందూ దీర్ఘాలు తీసినంత మాత్రాన గతాన్ని ఎవరైనా మరిచిపోతారా? అనేది కీలక ప్రశ్న. అందుకే చింత చచ్చినా.. ఇంకా అధికారంపై మాత్రం పులుపు చావలేదని ఈసడిస్తున్నారు సోషల్ మీడియా జనాలు.