ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు, అదేసమయంలో శాసన మండలి సమావేశాలు జరుగుతున్నాయి. మరో రెండు రోజుల్లో ఇవి ముగుస్తాయి. మొత్తం 9 రోజుల పాటు నిర్వహించనున్న ఈ సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఎలాంటి దూకుడు ప్రదర్శిస్తోంది? ఎలాంటి ప్రజా సమస్యలను లేవనెత్తుతోంది? ప‌్రభు త్వాన్ని ఎలా ప్రశ్నిస్తోంది? అనే అంశాలు కీలకంగా మారాయి. ముందు అసెంబ్లీ సమావేశాలను గమనిస్తే.. ప్రభుత్వ బలం ఎక్కువగా ఉండడంతో ఇక్కడ ప్రతిపక్షం ఒకింత వెనుకంజలోనే ఉందని చెప్పాలి. ప్రభుత్వం చేస్తున్న ఎదురు దాడిని సమర్ధంగా ఎదుర్కొనేందుకు టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు.
ఇక, అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న చంద్రబాబు.. కూడా సభలో టీడీపీని సమయ స్ఫూర్తి గా ముందుకు నడిపించడంలో వెనుకంజలోనే ఉన్నారనిఅంటున్నారు పరిశీలకులు. ప్రభుత్వం వేస్తున్న వ్యూహానికి ఆయన అనూహ్యంగా చిక్కుకుపోతున్నారని చెబుతున్నారు. అదేసమయంలో ప్రభుత్వం చేస్తున్న విమర్శలను కూడా ఆయన తిప్పికొట్టలేక .. దొరికిపోతున్నారని అంటున్నారు. దీంతో అసెంబ్లీలో బాబు దూకుడు పెద్దగా కనిపించడం లేదని చెబుతున్నారు. ప్రభుత్వాన్నిఆత్మరక్షణలో పడేయలేక పోతున్నారని అంటున్నారు.
మరోప్రధాన విషయం ఏంటంటే.. టీడీపీ తరఫున ఈ ఏడాది ఎన్నికల్లో గెలిచిన 23 మందిలో దాదాపు 12 మంది సభకు హాజరుకావడం లేదు. వీరిని హాజరయ్యేలా కఠినంగా వ్యవహరించడంలో చంద్రబాబు విఫలమయ్యారనే వాదన వినిపిస్తోంది. అదేసమయంలో మండలిలో పరిస్థితిని తీసుకుంటే.. మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు కు మారుడు, మాజీ మంత్రి లోకేష్ ఉన్నారు. ఈయన తన సత్తాను చాటేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలి స్తున్నాయి. నిజానికి మండలిలో టీడీపీకి మంచి బలం ఉంది. దీనిని సరిగా వినియోగించుకుని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడంలోను, ప్రశ్నించడంలోను కూడా లోకేష్ సక్సెస్ అవుతున్నారని అంటున్నారు.
రెండు రోజుల కిందట చంద్రబాబు అసెంబ్లీ మార్షల్స్‌పై చేసిన వ్యాఖ్యల విషయంలో మండలిలో లోకేష్ తన దైన వ్యూహం అనుసరించి అధికార పక్షంపై పైచేయి సాధించారు. అదేవిధంగా తన వ్యూహాన్ని అమలు చేయడంలోను, నాయకులను సమాయత్తం చేయడంలోను, హాజరును తగ్గకుండా చూడడంలోను కూడా లోకేష్ సక్సెస్ అవుతున్నారని చెబుతున్నారు.