టీడీపీలో ఆ చివరి నుంచి ఈ చివరికి అనేక మంది నాయకులు ఉన్నారు. ఆ మాటకొస్తే.. పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నామని చెప్పేవారు.. పార్టీలో కీలకంగా ఉన్నామని చెప్పేవారు.. సామాజిక వర్గాల వారీగా పార్టీని ముందుకు నడిపించింది తామేనని చెప్పిన వారే చెప్పేవారు కూడా ఉన్నారు. అయితే, ప్రస్తుతం పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉంది. అధికార పార్టీ వైసీపీ నుంచి విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి సటైర్లు పేలుస్తున్నారు.
మరి సాయిరెడ్డికి దీటుగా టీడీపీ నుంచి ఎవరైనా గళం వినిపిస్తున్నారా? అంటే.. వేళ్లమీదే లెక్కించాల్సిన పరిస్థితి. పైగా సాయిరెడ్డికి సరైన మొగుడు ఎవరైనా ఉన్నారా? అంటే.. కూడా కష్టమే.. కానీ, ఒకే ఒక్క నాయకుడు మాత్రం సాయిరెడ్డికి సరిసమానంగా ఒకే ఒక్క నాయకుడు సటైర్లు పేలుస్తున్నారు. సాయిరెడ్డికి సంబంధించి `శకుని మామా`-అనే వ్యాఖ్యతో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన నాయకుడు విజయవాడకు చెందిన ఎమ్మెల్సీ, విజయవాడ నగర టీడీపీ ఇంచార్జ్ బుద్ధా వెంకన్న అంటున్నారు పరిశీలకులు.
ఎప్పటికప్పుడు ఆయన టీడీపీ తరఫున సాయిరెడ్డి సహా సీఎంజగన్‌కు కూడా సటైర్లు పేలుస్తున్నారు. తాజా గా కూడా తనదైన శైలిలో బుద్ధా వెంకన్న సాయిరెడ్డిని చెడుగుడు ఆడేశారని అంటున్నారు వైసీపీ నాయకు లు. కరోనా బాధితులకు క్వారంటైన్ కింద హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌ను ఇవ్వొచ్చుకదా.. అంటూ.. విజయసాయి రెడ్డి ట్విట్టర్‌లో బాబుకు కౌంటర్ ఇచ్చారు. దీనిపై పార్టీలోని నాయకులు పెద్దగా స్పందించలేదు. కానీ, బుద్దా వెంకన్న మాత్ర ఈ విషయంలో ముందున్నారు. నిజానికి ఎంపీ కేశినేని నాని తన ట్విట్టర్‌లో స్పందిస్తారని అనుకున్నారు. కానీ, ఆయన మౌనం వహించారు.
ఈ సందర్భం బుద్ధా ట్వీట్ చేస్తూ.. హైదరాబాద్‌లో ఖాళీగా ఉన్న ఇంద్రభవనం లోట్‌సపాండ్, బెంగళూరులో ఖాళీగా ఉన్న యలహంక రాజప్రసాదాలను సీఎం జగన్ పెద్ద మనసు చేసుకుని కరోనా ఆస్పత్రు లకు ఇవ్వాలి. వాటిని ఇస్తే ప్రజాధనం కొట్టేసి నరకానికి వెళ్లిన వైసీపీ ఆత్మకు కొంత ఊరట వచ్చే అవకా శం ఉంటుంది విజయసాయిరెడ్డి గారూ!’ అని బుద్దా వెంకన్న చేసిన ట్వీట్‌టీడీపీ వర్గాల్లో భారీ ఎత్తున వైరల్ అవుతుండడం గమనార్హం. మొత్తానికి ఇప్పుడే కాదు.. గతంలోనూ అనేక సందర్భాల్లో వైసీపీకి తగిన విధంగా బుద్దా స్పందించిన తీరుకు నాయకులు ఫిదా అయ్యారు.