జగన్ ఆశించింది జరగకపోయినా.. జరగబోయేది మాత్రం ఆయనకు మంచేనని అంటున్నారు కేంద్రంలోని పెద్దలు. రాష్ట్రంలో శాస న మండలిని రద్దు చేస్తూ.. జగన్ నిర్ణయించారు. మూడు రాజధానులతో వికేంద్రీకరణకు మొగ్గు చూపడం, దీనికి సంబంధించిన బిల్లును శాసన మండలిలో టీడీపీ తీవ్రంగా వ్యతిరేకించడం, ఇక, సీఆర్‌డీఏ రద్దు బిల్లును కూడా మండలిలో టీడీపీ వ్యతిరేకించ డం తెలిసిందే. ఈ క్రమంలోనే మండలిని రద్దు చేస్తూ.. జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, దీనివెనుక జగన్ నిర్ణయం ఒక్కటే కాకుండా కేంద్రం దీనిని ఆమోదించాల్సి ఉంది. పార్లమెంటు ద్వారాలో ఆమోదం పొందితేనే మండలి రద్దు అవుతుంది.
అయితే, కేంద్రం ఇప్పటి వరకు బిల్లును ఆమోదించలేదు. వాస్తవానికి ప్రస్తుతం ముగిసిన బడ్జెట్ భేటీలో కేంద్రం ఆమోదిస్తుందని అనుకున్నారు. ఇంతలోనే కరోనా ఎఫెక్ట్ కారణంగా పార్లమెంటును అర్ధంతరంగా ముగించారు. దీంతో జగన్ ఆశలు తీరలేదు. అ యితే, కేంద్రంలో జగన్‌కు ఎలాగూ సన్నిహితులు ఉన్న నేపథ్యంలో వారు ఇప్పుడు జగన్‌కు కొన్ని సూచనలు సలహాలు ఇస్తు న్నారు. మండలి రద్దు కాలేదని ఫీలవ్వద్దని, ప్రస్తుతం టీడీపీకి ఉన్న సభ్యుల్లో కొందరు ఇప్పటికే వైసీపీ వైపు మొగ్గు చూపారు కాబట్టి.. మిగిలిన వారిని కూడా పార్టీ వైపు తిప్పుకొనే ప్రయత్నాలు చేయాలనేది ఢిల్లీ నుంచి జగన్‌కు అందిన తొలి సలహా!
ఇక, ఈ తొలి సలహాలో విఫలమైతే.. రెండో సలహాను తెరమీదికి తెచ్చారు. అది.. కొన్నాళ్లుఓర్పుతో వ్యవహరిస్తే.. ఎలాగూ .. వ చ్చే ఏడాది నాటికి వైసీపీ పూర్తిగా శాసన మండలిని ఆక్రమిస్తుందనేది కేంద్రం పెద్దల సలహా! దీనివల్ల పార్టీకి పార్టీ బలపడుతుంద ని, జగన్‌కు కూడా అసంతృప్తుల సమస్య తగ్గుతుందని సూచించారట. పోనీ.. ఈ రెండు సూచనలు, సలహాలను పక్కన పెట్టినా.. కూడా జగన్‌కు ఉన్న ఏకైక ఆశ.. వచ్చే వర్షాకాల సమావేశాలే. ఆ సమావేశాల్లో పార్లమెంటులో ఈ బిల్లు ఆమోదం పొందితే.. మండలి రద్దు అవుతుంది.
అయితే, ఇక్కడే చిన్న జర్క్ ఉంది. అదేంటంటే.. జగన్ ఏ ఉద్దేశంతో మండలిని రద్దు చేశారో.. ఆ ఉద్దేశం నెరవేరక పోవడం. అంటే, సకాలంలో మండలి రద్దు కాకపోవడం. దీంతో మండలిలో బిల్లులు మూడునెల్ల తర్వాత ఎలాగూ వీగి పోతాయి! సో.. మొత్తానికి జగన్ కు కేంద్రం ఇచ్చిన సలహా బాగానే ఉన్నా. ఏం చేస్తారో చూడాలి.