జగన్ సర్కారు ఇచ్చిన షాక్‌కు సంచలన నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఉలిక్కిపడ్డారా..? ఉరిమి ఉరిమి మంగళం మీద పడిందన్నట్లుగా ఏపీ రవాణా శాఖ చేసిన చర్యకు ప్రతిచర్యగా జేసీ జగన్ మీద పడ్డారా..? నిన్న మొన్నటిదాకా జగన్ సర్కారు ఏ పని చేసినా అది కరెక్ట్.. మావాడు ఏది చేసిన నిజాయితీగానే చేస్తాడు. బాగా చేస్తున్నాడు. అందుకే మావాడి పనితీరుకు 100కు 110 మార్కులు ఇస్తున్నా అన్నాడు.. ఇప్పుడు జగన్ సర్కారు చేసిన పనికి ఆయనే మరో మాట లేకుండా 100కు 150 మార్కులు ఇస్తున్నాడు. ఎందుకు ఆయన అలా మార్కులు పెంచుకుంటూ పోతున్నారు. జగన్ ఆయనకు చేసిన మేలు ఏంటో. మరి ఇంతలా మార్కులు పెంచుతున్నాడు. ఇదేమన్నా సీఎం జగన్ మీద ప్రేమతో పెంచుతున్న మార్కులు కాదు.. అక్కసుతో, బాధతో పెంచిన మార్కులు.
ముందుగా ఇచ్చిన మార్కులు మాత్రం ప్రేమతోనే ఇచ్చినవి. కానీ ఇప్పుడు ఇచ్చిన 150 మార్కులు మాత్రం జగన్ సర్కారు ఆ నేతకు ఎసరు పెట్టినందుకు ఇచ్చినవి అనుకుంటున్నారు రాజకీయ వర్గాలు. జగన్ పాలనకు ఇన్ని మార్కులు ఇచ్చిన మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, జగన్‌పై భారీగానే వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇలా మార్కులు ఇస్తూనే తనదైన మార్క్ వ్యంగ్యాస్త్రాలు సంధించడం చూస్తుంటే పాపం జేసీకి బాగా కాలినట్టుంది. జగన్ సర్కారు జేసీకి గట్టి షాక్ ఇచ్చినట్లుంది. అందుకే ఆయన మా వాడు అని కూడా చూడకుండా వ్యంగంగా జగన్‌పై కామెంట్లు చేశారు. బుధవారం అమరావతిలో ఆయన మాట్లాడుతూ ట్రావెల్స్ బస్సులు ఏపీలో ఎన్నో ఉంటే జగన్ కు నా బస్సులే కనిపిస్తున్నాయన్నారు.
నా బస్సులను సీజ్ చేసి, కేసులు నమోదు చేసినందుకు జగన్ పాలనకు 100కు 150 మార్కులు ఇవ్వాలన్నారు. తమ ట్రావెల్స్ కు చెందిన 31 బస్సులు సీజ్ చేశారన్నారు. తమ బస్సుల సీజ్ పై న్యాయపరంగా పోరాడతామన్నారు. తన బస్సులనే భూతద్ధంలో చూసి సీజ్ చేశారన్నారు. జరిమానాతో పోయే తప్పిదాలను సీజ్ చేయడం ఎంతవరకు సబబు అని జగన్ సర్కారను ఘాటుగా ప్రశ్నించారు జేసీ దివాకర్‌రెడ్డి. జేసీ ఫ్యామిలీకి చెందినదే దివాకర్ ట్రావెల్స్. ఈ ట్రావెల్స్‌కు చెందిన 31 బస్సులను నిబంధనలు ఉల్లంఘించినందుకు సీజ్ చేశారు. దీంతో జేసీ దివాకర్‌రెడ్డి మనస్తాపం చెంది ఇలా జగన్ సర్కారుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారని అంతా అనుకుంటున్నారు.