లాక్కోలేక పీక్కోలేక చస్తున్న అమెరికా, పాపం…!

-

తమ టాప్ కమాండర్ ని అమెరికా బాగ్దాద్ విమానాశ్రయంలో హత మార్చడంతో ఆగ్రహంగా ఉన్న ఇరాన్ ప్రతీకార దాడులకు దిగుతున్న సంగతి తెలిసిందే. పశ్చిమ ఆసియా నుంచి అమెరికా వెళ్ళిపోవాలని డిమాండ్ చేస్తున్న ఇరాన్, అమెరికా సైనికుల మీద దాడులు చేయడానికి సిద్దపడింది. రెండు రోజుల క్రితం అమెరికా బలగాలు ఉంటున్న బేస్ క్యాంపుల్లో దాడులు చేసిన ఇరాన్ సైన్యం,

గురువారం కూడా ఇరాక్ లోని గ్రీన్ జోన్ పై రాకెట్ల తో దాడులు చేసింది. అయితే ముందు చేసిన క్షిపణి దాడుల్లో తమ సైన్యం 80 మంది అమెరికా ఉగ్రవాదులను చంపిందని పేర్కొంది. ఇరాన్ అధికారిక మీడియాలో కూడా ఈ వార్త వచ్చింది. దీనిపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం అసలు ఎం జరగలేదు. మా వాళ్లకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పడంతో ఒక్కసారిగా ఇరాన్ చెప్పింది అబద్దామా అనే అనుమానాలు కలిగాయి.

ఇప్పుడు అంతర్జాతీయ మీడియా కూడా అమెరికా వాదనను నిజమే అంటుంది. పరిస్థితులు చేయి దాటిపోవడం ఇష్టం లేని ఇరాన్ దాడి చేసింది గాని అమెరికా బలగాలకు హాని జరగలేదని, అంతర్జాతీయ సమాజం ముందు తమ ప్రతాపం చూపించడానికే అలా ప్రకటన చేసిందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. అంతర్జాతీయ మీడియా ఉండేది అమెరికా చేతుల్లో కదా అలా చెప్పక ఇంకెలా చెప్తారు చెప్పండి. అందుకే అమెరికా కవర్ చేసుకుంది, దానికి అంతర్జాతీయ మీడియా మేకప్ వేసిందనేది కొందరి వాదన.

Read more RELATED
Recommended to you

Latest news