పిల్లల విషయంలో తల్లితండ్రులు చాల జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అందులోనూ పసిపిల్లల విషయంలో అయితే మరింత కేర్ తీసుకుంటారు. పైగా ఈ కాలంలో చలికి ఎక్కువ ఉంటుందని ఎక్కువగా బయటకి కూడా తీసుకురారు. మాములుగా పిల్లల్ని వేసవి కాలంలో ఆరుబయట నిద్రపుచ్చుతారు, ఎందుకంటే చల్ల గాలికి పిల్లలు హాయిగా నిద్రపోతారని . కొన్ని దేశాలలో చలికాలంలో సైతం ఆరుబయట పడుకోబెడుతారు. ఈ క్రమంలోనే రష్యాలో జరిగిన ఓ ఘటన విషాదంగా మారింది. వివరాలలోకి వెళ్తే..
తూర్పు రష్యాలో ఖబరోవ్స్క్ ప్రాంతంలో జరిగిన ఓ ఘటన ఇది. చలి దేశాలలో పిల్లలని ఆరుబయట పోడుకోబెట్టడం సాధారణమైన విషయమే ఎందుకంటే అక్కడ నమ్మకాల ప్రకారం ఆరుబయట చల్లగాలికి పిల్లలని పడుకోబెడితే దగ్గు, జలుబు, కొన్ని కొన్ని వ్యాధులని నివారించవచ్చట. ఈ క్రమంలోనే ఓ పిల్లాడి తల్లి తండ్రులు ఆరుబయట తన పిల్లాడిని బగ్గీ లో ఉంచి పడుకోబెట్టారు.
ఆమె తల్లి ఈలోగా ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకుని వద్దామని అనుకుని పిల్లాడానికి అక్కడే ఉంచింది. గంటల సమయం గడిచిపోతున్నా సరే పనుల వత్తిడితో పిల్లాడిని బయట ఉంచామని మర్చిపోయారు తల్లి తండ్రులు.దాంతో వారి నిర్లక్ష్యం వలన 5 గంటల పాటు -7 డిగ్రీ ల చలిలో ఉన్న బాబు గడ్డకట్టుకుని చనిపోయాడు. ఈ విషాద ఘటన చూసిన చుట్టుపక్కల వారు చలించిపోయారు. స్థానికుల సమాచారం ప్రకారం వచ్చిన పోలీసులు తల్లి తండ్రులని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.