ఈ ఆహారం తీసుకుంటే పిల్లలు ఆరోగ్యంగా ఉండచ్చు..!

-

చాలా మంది పిల్లలు బరువు తక్కువగా ఉండడం, బలహీనంగా ఉండటం మనం చూసే ఉంటాం. అటువంటి పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా వాళ్ళకి డైట్ లో కొన్ని మార్పులు చేయండి. తీసుకునే ఆహారం బట్టి వాళ్ళ ఆరోగ్యం ఉంటుంది. తల్లిదండ్రులు వాళ్ళ ఆహార విషయంలో శ్రద్ధ పెట్టాలి.

సరైన పోషక పదార్థాలు వాళ్లకి ఇవ్వాలి. విటమిన్స్, మినరల్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ అన్ని బ్యాలెన్స్డ్ గా ఉండేలాగా వాళ్లకి ఇవ్వాలి. బలహీనంగా ఉన్న పిల్లలకి నెయ్యి, పాలు, అరటిపండు, చిలకడ దుంపలు, ఆకుకూరలు వంటివి డైట్ లో పెట్టడం మంచిది. పిల్లలు బలహీనంగా ఉంటే వీటిని పెట్టండి.

గుడ్డు మరియు బంగాళదుంపలు:

బలహీనంగా ఉన్న పిల్లలకి గుడ్లు, బంగాళాదుంపలు పెట్టడం వల్ల ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఎందుకంటే వీటిలో కార్బోహైడ్రేట్స్ సమృద్దిగా ఉంటాయి. రెగ్యులర్ గా వీటిని పిల్లలకి పెట్టడం వల్ల బలంగా తయారవుతారు.

ఆకుకూరలు:

ఆకుకూరల్లో పోషక పదార్ధాలు ఎక్కువగా ఉంటాయి. అదే విధంగా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పిల్లలకు ఎక్కువగా బ్రోకలి, బంగాళదుంపలు, బచ్చలి కూర, క్యాబేజీ వంటి వాటిని రెగ్యులర్ గా పెట్టండి. వీటిలో పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి.

బనానా మిల్క్ షేక్:

అరటి పండు మంచి ఎనర్జీని ఇస్తుంది బలహీనంగా ఉన్న పిల్లలకు అరటి పండు పెట్టడం వల్ల వాళ్ళు బరువు పెరుగుతారు. కావాలంటే వాళ్లకి బనానా మిల్క్ షేక్ లాంటివి కూడా మీరు చేసి పెట్టొచ్చు.

నెయ్యి:

నెయ్యి మరియు బటర్ లో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. పప్పు లేదా రోటి లో నెయ్యి వేసి వాళ్లకి పెట్టడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇలా పిల్లల డైట్ లో మార్పులు చేస్తే వాళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి వీలవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news