పాకిస్థాన్​లో పోలీస్​ స్టేషన్​పై అత్మాహుతి దాడి.. 12 మంది మృతి

-

పాకిస్థాన్​లో ఘోరం జరిగింది. పోలీస్ స్టేషన్ లక్ష్యంగా జరిగిన ఆత్మాహుతి దాడిలో 12 మంది పోలీసులు దుర్మరణం చెందారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం రాత్రి స్వాత్​లోని కౌంటర్ టెర్రరిజమ్ కార్యాలయంపై ఈ దాడి జరిగింది.

పోలీస్ స్టేషన్ లక్ష్యంగా జరిగిన ఆత్మాహుతి దాడిలో 12 మంది పోలీసులు మరణించిన ఘటన ఖైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్రంలోని కబాల్ ఠాణా వద్ద చోటుచేసుకుంది. ఈ దాడితో ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్​లో హైఅలర్ట్ ప్రకటించారు. ఈ దాడికి ఏ ఉగ్రసంస్థ బాధ్యత తీసుకోనప్పటికీ.. ప్రభుత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన తర్వాత పాకిస్థానీ తాలిబన్లు ఈ తరహా దాడులకు తెగబడుతున్నారు. దీంతో తాజా దాడి వారి పనేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అంతకుముందు పోలీస్ స్టేషన్​లో జరిగిన 2 పేలుళ్లతో భవనం పూర్తిగా ధ్వంసమైనట్లు అధికారులు వెల్లడించారు. పోలీసులు కొందరు శిథిలాల కింద ప్రాణాలు కోల్పోయారని.. గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించినట్లు తెలిపారు. ఈ ఘటనతో సమీప ఆస్పత్రుల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news