డెయిరీ ఫాంలో భారీ పేలుడు.. 18,000 ఆవుల మృత్యువాత !

-

అమెరికాలోని టెక్సాస్‌లో భారీ ప్రమాదం జరిగింది. డిమ్మిట్‌లోని  సౌత్‌ ఫోర్క్‌ డెయిరీ ఫాంలో హఠాత్తుగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో దాదాపు 18,000 ఆవులు మృత్యువాత పడ్డాయి. అందులో పని చేస్తున్న ఓ మహిళకు తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రాణాలు కోల్పోయిన ఆవుల విలువ 36 మిలియన్‌ డాలర్లకుపైగా ఉంటుందని అంచనా. ఈ ఘటన ఏప్రిల్‌ 10న జరిగినట్లు సమాచారం.

డెయిరీఫాంలోని యంత్రాలు బాగా వేడెక్కడం వల్లనే ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పేలుడు జరిగిన తర్వాత ఒక్కసారిగా మీథేన్‌ అధికమొత్తంలో విడుదలైందని అందుకే ఆవులు మృతి చెంది ఉంటాయని భావిస్తున్నారు. ప్రమాదానికి గల స్పష్టమైన కారణాలు తెలియాల్సి ఉంది. డెయిరీ ఫాంలో సాధారణంగానే మీథేన్‌ వాయువు వెలువడుతుంది. పేడ ఎక్కువగా నిల్వ ఉండటం వల్ల దాని ద్వారా మీథేన్‌ బయటికి వస్తుంది.

2013 తర్వాత డెయిరీ ఫాంలలో ఇంతపెద్ద ప్రమాదం జరగడం ఇదే తొలిసారిని అక్కడి జంతు సంరక్షణశాఖ అధికారులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news