ఇంట్లో కరోనా పరిక్షలు చేసుకునే కిట్ కి అమెరికా గ్రీన్ సిగ్నల్

30 నిమిషాల్లో కరోనా పరిక్షల ఫలితాలను ఇచ్చే కరోనా కిట్ కి అమెరికా అనుమతి ఇచ్చింది. దీని ద్వారా ఇంట్లోనే కరోనా వైరస్ పరీక్ష చేసుకోవచ్చు. ఈ స్వీయ-పరీక్షా కిట్‌ ను ఆమోదించినట్లు యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ మంగళవారం తెలిపింది. లూసిరా హెల్త్ ద్వారా తయారు చేసిన సింగిల్-యూజ్ టెస్ట్, 14 సంవత్సరాల మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులకు స్వాబ్ టెస్ట్ చేసుకోవచ్చు.

ఈ కిట్‌ లను ఆసుపత్రులలో కూడా ఉపయోగించవచ్చు. అయితే 14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారు ఆస్పత్రుల ద్వారా నమూనాలను సేకరించాలి అని ఆరోగ్య నియంత్రణ సంస్థ తెలిపింది. ఇప్పుడు అమెరికాలో ఉన్న పరిస్థితి ఆధారంగా చూస్తే ఈ కిట్ చాలా బాగా ఉపయోగపడే అవకాశం ఉంది అనే చెప్పాలి. ఆ దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.