ఏవండీ… మనం ఓడిపోయాం, అంగీకరించండి, ట్రంప్ భార్య ఇలా అన్నారా…?

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ ఓడిపోయినా సరే తాను ఓడిపోయాను అనే విషయాన్ని ఆయన అంగీకరించడానికి ఒప్పుకోవడం లేదు. అసలు తన ఓటమిని ఆయన అంగీకరించడానికి నానా ఇబ్బందులు పెడుతున్నారు. ప్రపంచం మొత్తం కూడా ఆయన ఓటమి పాలయ్యారు అని చెప్పినా సరే ఎన్నికల్లో మోసం జరిగింది అంటూ సంచలన ఆరోపణలు చేసారు.

అయితే ఆయన భార్య మెలానియా ట్రంప్ మాత్రం ఆయన్ను ఓడిపోయామని అంగీకరించాలి అని చెప్పారట. యుఎస్ ప్రథమ మహిళ అయిన… మెలానియా ట్రంప్ తన భర్త డొనాల్డ్ ట్రంప్ తో… ఓటమిని అంగీకరించాలి అని, అనవసరంగా రాద్దాంతం చేయొద్దు అని, చెప్పారట. ఆమె తరుచుగా ట్రంప్ కి ఇవే మాటలు చెప్పింది అని జాతీయ మీడియా పేర్కొంది. గత నెలలో మెలానియా తన భర్త కోసం ఎన్నికల ప్రచారం చేసింది.