బీబీసీ ఛైర్మన్‌ రాజీనామా.. అదే కారణమా..?

-

ప్రముఖ వార్తా సంస్థ  బీబీసీ  ఛైర్మన్‌ రిచర్డ్‌ షార్ప్‌ తన పదవికి రాజీనామా చేశారు. 2021లో అప్పటి బ్రిటన్‌ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు రుణం ఇప్పించిన విషయంలో తన ప్రమేయాన్ని వెల్లడించకుండా.. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించినట్లు ఓ స్వతంత్ర దర్యాప్తులో తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

‘బీబీసీ ఛైర్మన్‌ పదవి కోసం దరఖాస్తు చేసుకోకముందే.. తాను ఈ పదవి విషయంలో ఆసక్తి చూపుతున్నట్లు అప్పటి ప్రధాని బోరిస్‌ జాన్సన్‌కు చెప్పారు. ఆయనకు రూ.8 కోట్ల మేర రుణం ఇప్పించే విషయంలోనూ సాయం చేశారు. కానీ, బీబీసీ ఛైర్మన్‌ పదవి నియామకం సమయంలో ఈ విషయాలు వెల్లడించలేదు’ అని రిచర్డ్‌ షార్ప్‌పై ఆరోపణలు వచ్చాయి. దీనిపై వాస్తవాలు తేల్చేందుకు.. ప్రభుత్వ నియామకాల కమిషనర్‌ ఆదేశాలతో ఓ స్వతంత్ర దర్యాప్తు చేపట్టారు.

రిచర్డ్ ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించినట్లు దర్యాప్తు నివేదికలో తేలింది. ఈ క్రమంలోనే శుక్రవారం ఆయన తన రాజీనామా ప్రకటించారు. బీబీసీ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. తదుపరి నియామకం వరకు పదవిలో కొనసాగుతానని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news