Miss AI : ‘ఏఐ’ సుందరాంగులకు అందాల పోటీలు

-

కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తోంది.. దీనిపేరే వినిపిస్తోంది. వంటలు చేయడం నుంచి అంతరిక్షం వరకు అన్ని రంగాల్లో దీన్ని వినియోగిస్తున్నారు. రోజురోజుకు ఏఐ కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ టెక్నాలజీతో పుట్టుకొచ్చిన ఏఐ అందాల భామలు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నారు. ఏఐ భామను చూస్తే అది అసలు నిజమైన అమ్మాయిలు కాదంటే నమ్మలేని పరిస్థితి.

అందుకే ఈ సుందరాంగుల కోసం ‘మిస్‌ ఏఐ (Miss AI)’ పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. ‘మిస్‌ ఇండియా’ వంటి పోటీల మాదిరిగానే వీటి ప్రతిభను పరీక్షించి.. ప్రైజ్‌ మనీ ఇవ్వనున్నట్లు వరల్డ్ ఏఐ క్రియేటర్ అవార్డ్స్‌ (WAICA) వెల్లడించిందని మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ మొట్టమొదటి ‘Miss AI’ పోటీలో మోడల్స్‌, ఇన్‌ఫ్లుయెన్సర్లు పోటీ పడనుండగా.. దీనికింద 20 వేల డాలర్ల ప్రైజ్‌మనీ ఇవ్వనున్నారు. ఈ భామల లుక్స్‌, వీటి క్రియేషన్స్‌ వెనక ఉపయోగించిన సాంకేతిక నైపుణ్యాలు, సోషల్‌ మీడియాలో అవి చూపుతున్న ప్రభావం వంటి వాటిని నిర్ణేతలు పరిగణనలోకి తీసుకోనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news