బ్రేకింగ్ : బిల్ గేట్స్ ఇంట తీవ్ర విషాదం.. సీనియర్ గేట్స్ మృతి..!

మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. సోమవారం నాడు ఆయన తండ్రి విలియమ్ గేట్స్ (94) కన్నుమూశారు. గత కొంత కాలంగా అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న ఆయన.. హుడ్ కెనాల్‌లోని తన బీచ్ హోంలో సోమవారం నాడు మరణించారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయన కుటుంబ సభ్యులే తెలియజేశారు. అలాగే తండ్రి మృతిపై బిల్ గేట్స్ ఒక ఎమోషనల్ ట్వీట్ కూడా చేశారు.

జీవితంలో తప్పకుండా జరగాల్సిన రోజు కోసం తామంతా మానసికంగా సిద్దమయ్యామని, తన తండ్రిని ఎంతగా మిస్ అవుతామో మాటల్లో చెప్పలేమని గేట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే నా తండ్రి నిజమైన బిల్ గేట్స్ అని తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. అలాగే విలియం గేట్స్ మృతి పట్ల పలువురు సంతాపాన్ని ప్రకటించారు. ఇకపోతే విలియమ్ గేట్స్ నవంబర్ 30, 1925న వాషింగ్టన్‌లోని బ్రెమెర్టన్‌లో జన్మించాడు.