లడఖ్ లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్‌ఐసి) వద్ద భారతీయ, చైనా దళాల మధ్య ఉద్రిక్తతల మధ్య, చైనా తన సైనికులను ఎల్‌ఐసి సమీపంలో పెద్ద సంఖ్యలో మోహరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. సోమవారం (సెప్టెంబర్ 7), చుషుల్ వద్ద ఉన్న ముఖ్రి ప్రాంతానికి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్ఎ) చొరబాటు ప్రయత్నాలను అడ్డుకోవడంలో భారత సైన్యం విజయవంతమైంది.
అయితే రాబోయే రోజుల్లో చైనా నుండి ఇలాంటి మరిన్ని చర్యలు వచ్చే అవకాశం ఉందని ఆర్మీ పేర్కొంది. సెప్టెంబర్ 1 న, చైనా ఎల్‌ఐసి వద్ద రెచిన్ లా సమీపంలో పిఎల్‌ఎ గ్రౌండ్ ఫోర్స్ చెందిన బెటాలియన్ ను చైనా మోహరించింది. అలాగే స్పాంగూర్ సరస్సు సమీపంలో రెండు బెటాలియన్లను కూడా మోహరించింది. ఇవన్నీ శిక్వాన్ వద్ద ఉన్న 62 కంబైన్డ్ ఆర్మ్స్ బ్రిగేడ్‌లో భాగం అని అధికారులు పేర్కొన్నారు.