‘యోగీ రంగంలోకి దిగితే ఫ్రాన్స్‌లో అల్లర్లు బంద్​’.. జర్మనీ ప్రొఫెసర్‌ ట్వీట్‌

-

తనిఖీల సమయంలో 17 ఏళ్ల కుర్రాడిని పోలీసులు కాల్చిచంపిన ఉదంతంతో ఫ్రాన్స్‌ అట్టుడుకుతోంది. రోజురోజుకు రణరంగంలా మారుతోంది. ఇప్పటికే దేశమంతా ఈ అల్లర్లు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్​లో అల్లర్లను అరికట్టేందుకు ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ను ఆ దేశానికి పంపాలని జర్మనీకి చెందిన ప్రొఫెసర్​, కార్డియాలజిస్టు ఎన్​.జాన్​ కామ్​ ట్వీట్ చేశారు.

YOGI

పారిస్​లో జరుగుతున్న అల్లర్లను యోగి ఆదిత్యనాథ్.. 24 గంటల్లో కట్టడి చేయగలరని జాన్​ అన్నారు. జాన్ కామ్ చేసిన ట్వీట్​ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఈ ట్వీట్​పై యోగి ఆదిత్యనాథ్ కార్యాలయం స్పందించింది. ‘ప్రపంచంలో ఓ ప్రాంతంలోనైనా తీవ్రవాదం అల్లర్లకు ఆజ్యం పోసినప్పుడు, శాంతి భద్రతలకు విఘాతం కలిగినప్పుడు ఉత్తర్​ప్రదేశ్​లో నేరస్థులపై ఉక్కుపాదం మోపే ‘యోగి మోడల్​’ను అనుసరించాలి. యోగి మోడల్​తోనే అల్లర్లను కట్టడి చేయవచ్చు’ అని ట్వీట్ చేసింది.

అయితే.. నెటిజన్లు ఆయన ట్విటర్ ఐడీపై అనుమానాలు వ్యక్తం చేశారు. జాన్​కామ్​ ట్విటర్​ హ్యాండిల్ చీటింగ్ కేసులో అరెస్టైన డాక్టర్ నరేంద్ర విక్రమాదిత్య యాదవ్‌కు చెందినదని కామెంట్లు పెడుతున్నారు. మరికొద్ది మంది నెటిజన్లు యోగికి మద్దతు పలుకుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news