కరోనా వైరస్ మనషుల నుంచి జింకలకు సోకింది. జింకల్లో కరోనా వైరస్ వేగంగా వ్యప్తి చెందుతుంది. అమెరికాలోని ఒహాయో అనే రాష్ట్రంలో 129 జింకలకు కరోనా వైరస్ సోకింది. ఆ జింకలకు మనుషుల నుంచే సోకిందని పరిశోదకులు గుర్తించారు. ఒహాయో రాష్ట్రంలో ఆరు ప్రాంతాల్లో 360 తెల్ల తోక జింకల శాంపిల్స్ సేకరించి పీసీఆర్ టెస్ట్ చేస్తే అందులో 129 జింకల్లో కరోనా వ్యాధి లక్షణాలు కనిపించాయని ఒహాయో స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు.
అయితే 129 జింకలలో మూడు రకాలైన కరోనా వేరియంట్లు ఉన్నాయని తెలిపారు. అయితే జింకలలో కరోనా వైరస్ చాలా వేగం గా వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలిపారు. అంతే కాకుండా జింకలలో కరోనా వైరస్ మ్యూటేషన్లు కూడా ఎక్కువగానే ఉంటుందని తెలిపారు. అయితే ఇది చాలా ప్రమాదకరం అని అన్నారు. జింకలలో మ్యూటేషన్ అయిన వైరస్ మనుషులకు సోకితే వ్యాక్సిన్ల సామర్థ్యం తగ్గుతుందని అన్నారు. జింకలలో వైరస్ వ్యాప్తిని వీలైనంత త్వరగా నియంత్రిచాలని సూచించారు.