అమెరికా పూర్తిగా మునిగిపోయింది… ఒక్క రోజులో ఎన్ని లక్షల కేసులంటే…!

-

జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం చేసిన ప్రకటన ఆధారంగా చూస్తే… అమెరికా మంగళవారం కొత్త కోవిడ్ -19 కేసుల రోజువారీ రికార్డును అధిగమించింది. 24 గంటల్లో 201,961 కేసులు ఆ దేశంలో నమోదు అయ్యాయి. మొత్తం కేసులు అమెరికాలో 1 కోటీ…02 లక్షల 38 వేల 243 కు చేరుకున్నాయి. మొత్తం 2 లక్షల 39 వేల 588 మంది మరణించారు. 24 గంటల వ్యవధిలో, అమెరికాలో 1,535 మరణాలు నమోదయ్యాయి.

యునైటెడ్ స్టేట్స్ వరుసగా ఎనిమిదవ రోజు రికార్డు స్థాయిలో కొత్త కరోనావైరస్ కేసులను నమోదు చేసింది. ఆగస్టు నుండి రోజు వారీ మరణాల సంఖ్య పెరిగింది. నవంబర్ మొదటి 10 రోజుల్లో అమెరికాలో మిలియన్ మంది కరోనాతో ఆస్పత్రుల్లో జాయిన్ అయ్యారు. ఆ దేశంలో ఎన్నికల నిర్వహణ, ప్రచారం ఇవి అన్ని కూడా కరోనా తీవ్రతను బాగా పెంచాయి.

Read more RELATED
Recommended to you

Latest news