నేడు కేంద్ర కేబినెట్‌ భేటీ..కీలక అంశాలపై చర్చ.

-

కేంద్ర కేబినెట్‌ ఇవాళ మధ్యాహ్నం సమావేశం కానుంది..కరోనా వైరస్‌ వ్యాప్తి నేఫథ్యంలో గత కొంతకాలంగా కేంద్ర కెబినెట్ సమావేశాలు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా భేటీ అవుతున్నారు..ఈరోజు కూడా వర్చువల్‌లో సమావేశం కానున్నారు.ఈ సమావేశానికి సంబంధించిన అజెండా మాత్రం ఇంకా ప్రకటించలేదు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ ఈ నెల 4న సమావేశమై ఆరోగ్యం, వైద్య రంగంలో సహకారంపై భారత్, ఇజ్రాయెల్ మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకం చేసింది..టెలికమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ (ఐసీటీ) రంగంలో సహకారంపై భారత కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ, యునైటెడ్ కింగ్‌డమ్ ప్రభుత్వ డిజిటల్, కల్చర్, మీడియా అండ్ స్పోర్ట్స్ (డీసీఎంఎస్) మధ్య అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది..దేశ వ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ తన హవాను కొనసాగించింది..కీలకమైన బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి మెజార్టీ సాధించినస్పటికి..సీఎం అభ్యర్థిపై చర్చ జరిగే అవకాశం ఉంది..మరోవైపు దేశంలో కరోనా సెకండ్ వేవ్‌పై..మరికొన్ని ఉద్దీపీన ఫ్యాకేజీలు అవసరంపై ఈ భేటీలో చర్చ జరగనుంది..అమెరికా ఎన్నికల్లో బైడెన్‌ గెలుపుతో..దౌత్యపరంగా యూఎస్‌తో అనుసరించాల్సిన అంశంపై ప్రధానంగా చర్చ జరగనుంది..

Read more RELATED
Recommended to you

Latest news