బీఫ్ ప్యాకెట్ పై కరోనా: చైనా అలెర్ట్

-

నిల్వ చేసిన ఆహారంపై కరోనా వ్యాప్తి ప్రమాదం తక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు చైనా మాత్రం అలెర్ట్ అయింది. బ్రెజిల్ గొడ్డు మాంసం మరియు సౌదీ అరేబియా రొయ్యల ప్యాకేజింగ్ పై వైరస్ నమూనాలను గుర్తించిన తరువాత చైనా దేశ ప్రజలను హెచ్చరించింది. బ్రెజిల్ గొడ్డు మాంసం ప్యాకేజింగ్ పై కరోనా వైరస్ నమూనాలను గుర్తించారు.

కరోనా పుట్టిన ఊహాన్ లో ఇది గుర్తించారు. నిల్వ ఉంచిన ప్యాకెట్ లపై కరోనా వైరస్ నమూనాలను కనుగొన్నట్లు వుహాన్ మునిసిపల్ హెల్త్ కమిషన్ తన వెబ్‌ సైట్‌ లో ఒక ప్రకటనలో తెలిపింది. ఆగస్టు 7 న కింగ్డావో నౌకాశ్రయంలో ఇది దేశానికి చేరుకోగా ఆగస్టు 17 న వుహాన్ కు చేరుకుంది … అక్కడ ఇది ఇప్పటి వరకు కోల్డ్ స్టోరేజ్ లో ఉంది అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news