కోవిడ్ ఇప్పుడే అంతం కాదు.. మరిన్ని వేవ్‌లు వ‌స్తాయి.. జోస్యం చెప్పిన సైకిక్‌..!

-

జోతిష్యులు, సైకిక్స్.. వీరు చేసే ప‌ని ఒక్క‌టే. ప‌లు ర‌కాల రీడింగ్స్‌ను బ‌ట్టి వీరు ఒక వ్య‌క్తికి చెందిన లేదా ఒక ప్రాంతానికి చెందిన భ‌విష్య‌త్తు ఎలా ఉంటుందో చెబుతారు. గ‌తంలో కొంద‌రు చెప్పిన జోస్యాలు నిజం అయ్యాయి. కొన్ని కాలేదు. ఈ క్ర‌మంలోనే కోవిడ్ గురించి కొంద‌రు జ్యోతిష్యులు, సైకిక్స్ ముందే చెప్పారు. ఇక అలాంటి ఒక సైకిక్ మ‌న భ‌విష్య‌త్తు ఎలా ఉండ‌బోతుంది ? అన్న విష‌యాన్ని వెల్ల‌డించింది.

covid will not end now says psychic

రోగ్జాన్నే ఫ‌ర్నివాల్ అనే సైకిక్ రానున్న సంవ‌త్స‌రాల కాలంలో ఎలాంటి ప‌రిణామాలు ఏర్ప‌డుతాయో జోస్యం చెప్పింది. కోవిడ్ ఇప్పుడే అంతం కాద‌ని, 2023 లో కోవిడ్ త‌గ్గుతుంద‌ని చెప్పింది. ఇక ప్రిన్స్ హ్యారీ, మేగ‌న్ మార్కెల్ దంప‌తుల‌కు ఇంకో బిడ్డ జ‌న్మిస్తుంద‌ని, ప్రిన్స్ విలియ‌మ్స్ అధికార బాధ్య‌త‌లు తీసుకుంటాడ‌ని, బ్రిట‌న్ ప్ర‌ధానిగా బోరిస్ జాన్స‌న్ మ‌ళ్లీ ఎన్నిక‌ల్లో గెలుస్తార‌ని చెప్పింది. అలాగే డిసెంబ‌ర్ లో ఒక తీవ్ర‌మైన కోవిడ్ వేవ్ వ‌స్తుంద‌ని తెలిపింది.

ఇక రానున్న సంవ‌త్స‌రాల్లో ప్ర‌పంచ యుద్ధం సంభ‌వించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ఫ‌ర్నివాల్ జోస్యం చెప్పింది. దీంతో స‌మాజంలో అశాంతి నెల‌కొంటుందని చెప్పింది. యూకేలో అయితే భారీ వ‌ర‌ద‌లు సంభ‌వించే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. ప్ర‌పంచ వ్యాప్తంగా రాజ‌కీయ అనిశ్చితి నెల‌కొంటుంద‌ని, దీంతో దేశాల మ‌ధ్య యుద్ధాలు ఎక్కువ‌గా వ‌స్తాయ‌ని చెప్పింది. మ‌రి ఈ విష‌యాలు నిజం అవుతాయో, కావో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news