ఇండోనేషియాకు భారత్ భారీ సాయం.. ఆక్సిజన్ కంటెయినర్లు, ద్రవ ఆక్సిజన్ అందజేత

న్యూఢిల్లీ: కొవిడ్-19 మహమ్మారి పోరాటంలో భాగంగా ఇండోనేషియాకు భారత్ భారీ సాయం అందజేసింది. శనివారం ఐదు క్రయోజనిక్ ఆక్సిజన్ కంటెయినర్లతోపాటు 100 మిలియన్ టన్నుల ద్రవ ఆక్సిజన్, 300 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను భారత నావల్ షిప్ అరిహంత్‌లో పంపించింది.

India sends 100 MT oxygen, 300 concentrators to Indonesia

కొవిడ్-19‌పై ఉమ్మడి పోరాటం చేయాల్సి ఉంది. ఇండోనేషియాకు ఐఎన్‌ఎస్ అరిహంత్ చేరుకున్నది. అందులో ఆక్సిజన్ కాన్సన్‌టేటర్లు, ద్రవ ఆక్సిజన్ ఉన్నది. ఇప్పటికే ఓడరేవుకు నౌక చేరుకోవాల్సి ఉంది. కానీ, ఆలస్యమైంది అని విదేశాంగ వ్యవహారాల మంత్రి జైశంకర్ ట్వీట్ చేశారు.

గత మే నెలలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా భారత్ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నది. ఆ సమయంలో రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఇండోనేషియా 1400 ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను భారత్‌కు పంపించింది.

గత కొద్దిరోజులుగా ఇండోనేషియాలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. తీవ్ర ఆక్సిజన్ కొరత రోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇండోనేషియాలో శుక్రవారం ఒక్కరోజే 49,000 కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 31 లక్షలకు చేరుకున్నది.