నేడు జపాన్​ మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియలు.. మోదీ హాజరు

-

జులై 8న జపాన్ లోని నారాలో ఎన్నికల ప్రచార సభలో దారుణ హత్యకు గురైన జపాన్ మాజీ ప్రధాని షింజ్ అబే అంత్యక్రియలు నేడు నిర్వహించనున్నారు. దాదాపు మూడు నెలల తర్వాత అధికార లాంఛనాలతో జపాన్ ప్రభుత్వం అబే అంత్యక్రియలు నిర్వహించనుంది. దీనికోసం ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేస్తోంది. అయితే షింజ్ అబే అంత్యక్రియలకు బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియల కంటే ఎక్కువగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.

వందల దేశాల ప్రతినిధులు.. వేల మంది జపాన్ వాసులు.. 18వేల మంది సిబ్బందితో భద్రత.. 11.8 మిలియన్ డాలర్ల(సుమారు రూ.96 కోట్ల 28 లక్షల 74 వేలు) ఖర్చుతో ఇవాళ షింజో అబే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రాజధాని టోక్యోలో ఈ కార్యక్రమం జరగనుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ సహా వందల దేశాల నుంచి మొత్తం 4,300 మంది ప్రతినిధులు, వేల మంది జపనీయులు హాజరయ్యే ఈ కార్యక్రమానికి అక్కడి సర్కార్ ఏకంగా 18వేల మంది భద్రతా సిబ్బందిని మోహరిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news