వలసదారులపై జో బైడెన్ ఆసక్తికర కామెంట్స్

-

వలసదారులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలపడడంలో విదేశాల నుంచి వస్తున్న వలసదారులది ముఖ్య పాత్ర అని వ్యాఖ్యానించారు. ఆసియా అమెరికన్లు సహా అక్కడ స్థిరపడ్డ విదేశీ కమ్యూనిటీలు ఏర్పాటు చేసిన విరాళాల సేకరణ కార్యక్రమంలో బైడెన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

“వలసవిధానాన్ని ప్రోత్సహించని దేశాల్లో వృద్ధి నెమ్మదిగా సాగుతోంది. చైనా, జపాన్‌, భారత్‌ వంటి దేశాలు వలసదారులను ఆహ్వానించే విషయంలో వెనకబడ్డాయి. అందుకే ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి. అమెరికా ఎప్పుడూ విదేశీయులను సాదరంగా ఆహ్వానిస్తుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రత్యర్థి అయిన డొనాల్డ్‌ ట్రంప్‌ను వలసదారుల వ్యతిరేకి. చైనా, రష్యాలను ఎదుర్కోవడానికి జపాన్‌, భారత్‌ వంటి దేశాలతో బంధాన్ని మరింత బలపర్చేందుకు నేను కృషి చేస్తున్నాను.” అని బైడెన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news