ఇండో అమెరికన్ కి జో బిడెన్ కీలక బాధ్యతలు…!

-

ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ను ఓడించి అధ్యక్షుడిగా త్వరలో బాధ్యతలు చేపట్టే నూతన అధ్యక్షుడు జో బిడెన్… సోమవారం ప్రకటన చేయబోయే కరోనా వైరస్ టాస్క్ ఫోర్స్ లో భారత సంతతి వైద్యుడు ఉండే అవకాశం ఉంది. ఇండో -అమెరికన్ వైద్యుడు డాక్టర్ వివేక్ మూర్తిని కరోనా వైరస్ టాస్క్‌ఫోర్స్‌ లో తీసుకునే అవకాశం ఉంది. వాస్తవానికి కర్ణాటకకు చెందిన వివేక్ మూర్తి (43) ను అమెరికా 19 వ సర్జన్ జనరల్‌ గా అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా 2014 లో నియమించారు.

కరోనా వైరస్ పై టాస్క్‌ఫోర్స్‌ ను సోమవారం ప్రకటించనున్నట్లు జో బిడెన్ తెలిపారు. “సోమవారం, బిడెన్-హారిస్ కరోనా వైరస్ ఉమ్మడి ప్రణాళికను తీసుకొని 2021 జనవరి 20 న ప్రారంభమయ్యే యాక్షన్ ను బ్లూ ప్రింట్‌ గా మార్చడానికి గానూ సహాయంగా ప్రముఖ శాస్త్రవేత్తలు మరియు నిపుణుల బృందాన్ని సలహాదారులుగా పేరు పెడతాను” అని జో బిడెన్ పేర్కొన్నారు. అయితే కరోనావైరస్ టాస్క్‌ఫోర్స్‌కు ఎవరు నాయకత్వం వహిస్తారో ప్రకటించలేదు.

Read more RELATED
Recommended to you

Latest news