Malala Yousafzai: ఆస్కార్ వేదికపై మెరిసిన మలాలా

-

సోషల్ యాక్టివిస్ట్ మ‌లాలా యూస‌ఫ‌జాయి 95వ ఆస్కార్ వేడుకల్లో మెరిసింది. చిన్న వ‌య‌సులోనే నోబెల్ శాంతి బ‌హుమ‌తి గెలిచిన ఈ పాకిస్థానీ యాక్టివిస్ట్ ఆస్కార్స్​కు తన భ‌ర్త అస‌ర్ మాలిక్‌తో క‌లిసి హాజ‌రైంది. తను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌గా తీసిన షార్ట్ ఫిల్మ్ ‘స్ట్రేంజ‌ర్ ఎట్ ద గేట్‌’.. బెస్ట్ డాక్యుమెంట‌రీ షార్ట్ ఫిల్మ్ కేట‌గిరీలో నామినేట్‌ అయినందున మలాలా ఆస్కార్​ పురస్కారాల ప్రదానోత్సవానికి వచ్చింది.

ఈ ఈవెంట్​కు మలాలా సిల్వ‌ర్ క‌ల‌ర్ హుడ్ గౌన్‌లో మెరిసింది. రాల్ఫ్ లారెన్ బ్రాండ్‌కు చెందిన డ్రెస్సులో వెలిగిపోయింది. ఎప్పుడూ సల్వార్ కమీజ్​లో కనిపించే మలాలా.. ఈ ఈవెంట్​కు ట్రెండీగా అవ్వడంతో అందరూ స్టన్ అయ్యారు. ట్రెండీగా ఉన్నా.. తలపై ఎప్పుడూ దుప‌ట్టా వేసుకునే మ‌లాలా.. అదే త‌ర‌హాలో గౌన్‌ను డిజైన్ చేయించడం గమనార్హం.

ఇక ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతున్న సమయంలో హోస్ట్ జిమ్మీ కిమ్మ‌ల్.. హాలీవుడ్‌లో న‌డుస్తున్న స్పిట్‌గేట్ గురించి ఆమెను ప్రశ్నించాడు. దానికి మలాలా సమయస్ఫూర్తితో సమాధానమిచ్చింది. తాను కేవ‌లం శాంతి గురించి మాత్ర‌మే మాట్లాడతానని చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news