ఉద్యోగులకు షాక్ ఇచ్చిన కేంద్రం… !

-

ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ని ఇచ్చింది. ఉద్యోగులకు సంబంధించిన డియర్‌నెస్ అలవెన్స్‌ కి సంబంధించి బ్యాడ్ న్యూస్ చెబుతోంది. డియర్‌నెస్ అలవెన్స్ అరియర్స్ ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి లేదని క్లియర్ గా చెప్పేసింది. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే..

కోవిడ్ 19 సమయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వవలసిన 18 నెలల డియర్‌నెస్ అలవెన్స్ ని ఇవ్వమన్నట్టు ప్రభుత్వం చెప్పింది. డియర్‌నెస్ అలవెన్స్‌కు సంబంధించి మూడు ఇన్‌స్టాల్‌మెంట్లు నిలుపుదల చేశాం అని అంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఇది వర్తిస్తుంది.

01.01.2020, 01.07.2020, 01.01.2021 ఈ మూడు ఇన్‌స్టాల్‌మెంట్ల డీఏ ఉద్యోగులకు ఇంకా ఇవ్వలేదు. కోవిడ్ ఏ దీనికి ముఖ్య కారణం. కరోనా వైరస్ వల్ల ప్రభుత్వంపై ఆర్థిక పరమైన ఒత్తిడి పడడం తో డీఏ ఇవ్వలేకపోయాం అని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరీ చెప్పారు.

ఇంకా కేంద్ర ప్రభుత్వపు ఆర్థిక లోటు ఎక్కువగానే ఉందని అన్నారు. యాక్ట్‌లో పేర్కొన్న దాని కన్నా రెట్టింపు స్థాయిలో ఉన్నట్టు చెప్పారు. ఈ లెక్కన చూస్తే ఆ డబ్బు రానట్టుగానే వుంది. దీనితో డియర్‌నెస్ అలవెన్స్ అరియర్స్ ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి లేదని తెలిసి పోతోంది. మరి ఏం చేస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news