నా భర్త యోధుడు: ట్రంప్ భార్య

-

అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ తన భర్త కోసం తొలిసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అతన్ని “పోరాట యోధుడు” అని ప్రశంసించారు ఆమె. కరోనా మహమ్మారి బాధితులకు మద్దతు ఇవ్వడంలో ట్రంప్ యోధుడు అని అన్నారు. 50 ఏళ్ల మెలానియా… ట్రంప్ తన భర్త ప్రచార కార్యక్రమాలలో చాలా అరుదుగా హాజరయ్యారు. కానీ ఆగస్టులో జరిగిన రిపబ్లికన్ పార్టీ నామినేటింగ్ సదస్సులో ఆమె చేసిన ప్రసంగానికి ప్రశంసలు వచ్చాయి.Nina Burleigh: Melania Trump isn't a liberal punchline. How a model became  a despot's wife.

“డోనాల్డ్ ఒక పోరాట యోధుడు, అతను ఈ దేశాన్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రతిరోజూ మీ కోసం పోరాడుతాడు” అని ఆమె అన్నారు. పెన్సిల్వేనియాలోని నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసారు. ఆమె గత వారం కరోనా నుంచి కోలుకున్నారు. “మా కుటుంబం కోవిడ్ -19 తో బాధపడుతున్నప్పుడు మీరు మాకు ఇచ్చిన అన్ని ప్రేమ మరియు మద్దతుకు ధన్యవాదాలు” అని ఆమె తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news