ఆ రెండు దేశాల్లో అడుగుపెట్టిన కొత్త వైరస్‌..!

-

బ్రిటన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కొత్త కరోనా వైరస్‌ మరో రెండు దేశాల్లో అడుగు పెట్టింది. ఇజ్రాయెల్, ఉత్తర ఐర్లండ్‌లలో కోవిడ్-‌19 పరీక్షలు నిర్వహించగా కొత్త వైరస్‌ లక్షణాలు బయట పడుతున్నాయి. ఇజ్రాయెల్‌లోఅనుమానం ఉన్న నలుగురికి పరీక్షలు చేయగా వారిలో కొత్తరకం వైరస్‌ బయట పడింది. అప్రమత్తమైన ఆరోగ్యశాఖ వారిని ఎవరినీ కలవకుండా ఓ హోటల్‌లోని గదుల్లో ఉంచి చికిత్స నిర్వహిస్తుంది. వారు ఎవరెవరిని కలిశారో ఆ విరాలు సెకరిస్తూ వారిని సైతం పరీక్షలకు పిలుస్తున్నారు. పాత కరోనాతోనే సతమతమవుతున్న తరుణంలో ఈ కొత్తరకం వైరస్‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నామని ఆ దేశ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ మాత్రం అనారోగ్య సమస్యలు తలెత్తినా ఇది.. పాత వైరస్సా..? లేక కొత్తవైరస్సా..? అనే ప్రశ్నాలతో తికమక పడుతున్నారు. ఉత్తర ఐర్లండ్‌లో కూడా ఓ కేసు నమోదనట్లు తెలిసింది.

మరణాల రేటు ఇలా..

మన దేశంలో మరణాల రేటు దగ్గుతుంది. గత 12 రోజులుగా 400 లోపు నమోదయ్యాయి. ఈ మేరకు క్రీయశిల కేసులు 2.80 శాతం ఉండగా, రికవరీ 95.75 శాతం ఉన్నట్లు తెలిసింది. కేరళలో కేసుల నమోదు మహారాష్ట్రలో మరణాల రేటు ఏమాత్రం తగ్గలేదు. ఈ రెండు విషయాల్లో ఆ రెండు రాష్ట్రాల్లో తప్పిస్తే అన్ని రాష్ట్రాల్లో రోజూ 2 వేల లోపే కేసులు రాగా, సగానికి సగం మరణాలు తగ్గిపోయాయి. గత 24 గంటల్లో ఆరు రాష్ట్రాల్లో ఒక్క మరణం కూడా లేదు. నవంబర్‌లో కరోనా కేసులతో ఆందోళన కలిగించిన ఢిల్లి ప్రస్తుతం రోజువారి కేసుల్లో 10 స్థానంలో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news