విదేశాలకు వెళ్ళిన ప్రయాణీకులపై మూడేళ్ల నిషేధం.. సౌదీ అరేబియా.. లిస్టులో ఇండియా పేరు కుడా.

కరోనా మహమ్మారి కొత్త రూపాంతరాలు ఎప్పుడు ఇబ్బంది పెడతాయో తెలియని కారణంగా చాలా దేశాలు ఇతర దేశాల నుండి వచ్చే ప్రయాణీకులపై ఆంక్షలు విధించాయి. ఇంకా చాలా దేశాలు అసలు ప్రయాణాలకు అనుమతి ఇవ్వట్లేదు. అందులో సౌదీ అరేబియా కూడా ఉంది. ఇండియా, బ్రెజిల్, ఆఫ్ఘనిస్తాన్, ఇండోనేషియా, ఇథియోపియా, ఈజిప్ట్, లెబనాన్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, టర్కీ, వియత్నాం మొదలగు దేశాలు ఉన్నాయి.

2020మార్చి నుండి ముందస్తు అనుమతి లేకుండా ఇతర దేశాల పర్యటనకు వెళ్ళి కరోనా నియమ నిబంధనలు పట్టించుకోని వారు ఉన్నారని, వారిపట్ల కఠిఇన చర్యలు తీసుకుంటారమని సౌదీ అధికారులు చెబుతున్నారు. ఇలా వెళ్ళిన వారిని గుర్తించే పనిలో పడ్డ సౌదీ ప్రభుత్వం, అలా గుర్తింపబడ్డ వారందరికీ ఎక్కువమొత్తంలో జరిమానా విధించడంతో పాటు మూడేళ్ళ పాటు ఇతర దేశాలకు వెళ్ళకుండా ట్రావెల్ నిషేధాన్ని విధించాలని భావిస్తున్నారని సమాచారం.