ఓమిక్రాన్‌ను ఎదుర్కొవ‌డానికి ఆ దేశంలో నాలుగో డోసు

-

ప్ర‌పంచ వ్యాప్తంగా ఓమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్త‌రిస్తుంది. దీంతో ప్ర‌పంచ దేశాలు అప్ర‌మ‌త్తం అవుతున్నాయి. కొన్ని దేశాల్లో రెండో డోసు పంపిణీ చేయ‌డంలో వేగం పెంచాయి. అలాగే మ‌రి కొన్ని దేశాల్లో మూడో డోసు పంపిణీ చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. కానీ ఇజ్రాయ‌ల్ దేశ ప్ర‌భుత్వం ఓమిక్రాన్ వేరియంట్ ను ఎదుర్కొవ‌డానికి ఏకంగా నాలుగో డోసు పంపిణీ చేయ‌డానికి సిద్ధం అయింది. అంతే కాకుండా ఇప్ప‌టి కే ఇజ్రాయ‌ల్ లోని 150 మంది వైద్య సిబ్బందికి ఫైజ‌ర్ వ్యాక్సిన్ ను నాలుగో డోసును అందించింది.

అయితే ఇజ్రాయ‌ల్ లో నాలుగో డోసు తీసుకున్న 150 మంది వైద్య సిబ్బంది ఆరోగ్యంగా ఉంటే.. వారు ఓమిక్రాన్ ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొంటే దేశ ప్ర‌జ‌లు అంద‌రికీ నాలుగో డోసు ఇవ్వ‌నున్నార‌ని ఇజ్రాయల్ ప్ర‌భుత్వ వ‌ర్గాలు తెలిపాయి. కాగ ఇజ్రాయ‌ల్ దేశంలో ఈ ఏడాది ఆగ‌స్టు లోనే మూడో డోస్ ను ప్ర‌జ‌ల‌కు పంపిణీ చేశారు. కాగ నాలుగో డోసు పంపిణీ చేయ‌డానికి ఆ దేశ వైద్య ఆరోగ్య శాఖ త్వ‌ర‌లోనే నిర్ణ‌యం తీసుకోనుంది.

Read more RELATED
Recommended to you

Latest news