తీరం చేరిన టైటాన్‌ శకలాలు.. మానవ అవశేషాలు లభించేనా..?

-

అట్లాంటిక్‌ మహాసముద్రంలో పేలిపోయిన టైటాన్‌ సబ్​మెరైన్ శకలాలు ఎట్టకేలకు తీరాన్ని చేరాయి. కెనడాలోని న్యూఫౌండ్‌లాండ్‌ అండ్‌ లాబ్రడార్‌ ప్రావిన్సులోని సెయింట్‌ జాన్స్‌ ఓడరేవుకు బుధవారం వాటిని తీసుకొచ్చారు. అందులో మానవ అవశేషాలు లభించే అవకాశం ఉందని యూఎస్​ కోస్ట్​గార్డ్​ బుధవారం తెలిపింది. జలాంతర్గామి పేలిపోవడానికి కారణాలేంటో తెలుసుకునేందుకు జరుగుతున్న దర్యాప్తులో ఇదో కీలక పరిణామమని నిపుణులు చెబుతున్నారు.

‘టైటాన్ జలాంతర్గామి పేలిపోవడానికి దారితీసిన అంశాలను అర్థం చేసుకోవడానికి ఇంకా చాలా దర్యాప్తు చేయాల్సి ఉంది. ఇలాంటి విషాదం మళ్లీ జరగకుండా చూసుకోవడంలో అది సహాయం చేస్తుంది’ అని కోస్ట్ గార్డ్ చీఫ్ కెప్టెన్ జాసన్ న్యూబౌర్ తెలిపారు.

మరోవైపు సబ్​మెరైన్ శకలాలను వెతకడానికి పెలాజిక్ రీసెర్చ్ సర్వీసెస్ సంస్థ హారిజాన్​ ఆర్కిటక్ అనే నౌకను రంగంలోకి దింపింది. అందులో ఉన్న రిమోట్ ఆపరేటెడ్​ వాహనం (ఆర్​ఓవీ) ద్వారా జలాంతర్గామి శకలాల ఆచూకీని గత వారం గుర్తించారు. ఆఫ్​షోర్​ గాలింపు కార్యకలాపాలను బుధవారం పూర్తి చేసినట్లు పెలాజిక్​ రీసెర్చ్​ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news