ఈమధ్య కాలంలో హీరోయిన్లు ఎక్కువగా క్లీవేజ్ షో చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తమ అందచందాలతో యువతను ఆకట్టుకుంటూ పాపులారిటీ సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా పూజా హెగ్డే కూడా గ్లామరస్ లుక్ తో మరొకసారి యువతను మంత్రముగ్ధుల్ని చేసింది. తాజాగా ముంబైలో ఒక ప్రైవేటు ఈవెంట్ కి హాజరైన ఈ ముద్దుగుమ్మ టైట్ బాడీ కాన్ డ్రెస్ లో తన అందాలతో పర్ఫెక్ట్ ఫిగర్ చూపిస్తూ యువతను మెస్మరైజ్ చేసిందని చెప్పవచ్చు. తాజాగా ఈమె గ్లామరస్ లుక్ ఇప్పుడు నెట్టింట చాలా వైరల్ గా మారుతోంది.
గ్లామర్ పరంగా యువతను ఆకట్టుకుంటుంది కానీ కెరియర్ పరంగా తనకు బ్యాడ్ టైం నడుస్తోందని చెప్పవచ్చు. కొత్త ఆఫర్స్ రాకపోగా వచ్చినవి కూడా చేజారిపోతున్నాయి. అలా భారీ బడ్జెట్ మూవీ గుంటూరు కారం సినిమా నుండి తాజాగా ఈమె తప్పుకున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ ఆమె రోల్ ప్రాధాన్యతను తగ్గించి సెకండ్ హీరోయిన్ ను చేశాడట. అందుకే తీసుకున్న అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేసి గుంటూరు కారం సినిమాకి గుడ్ బాయ్ చెప్పేసింది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే మహేష్ బాబు తనను ఎలాగైనా సరే సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తారు అనుకుంటే త్రివిక్రమ్ చేసిన పనికి ఆశ కాస్తా నిరాశగా మిగిలింది.
గత ఏడాది ఇలాగే జనగణమన అనే పాన్ ఇండియా ప్రాజెక్టు కూడా కోల్పోయింది ఈ ముద్దుగుమ్మ అప్పుడు కూడా నిర్మాతలు హ్యాండ్ ఇవ్వడంతో విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ ల డ్రీం ప్రాజెక్టు ఆగిపోయింది. మొత్తానికైతే ఈమె కెరియర్ ఇప్పుడు ప్రమాదంలో పడిందని చెప్పవచ్చు. మరి ఈమెకు ఎలాగైనా సరే అవకాశాలు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.