ఓటమి తర్వాత బయటకు వచ్చిన ట్రంప్… ఈసారి మాస్క్ తోనే…!

అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ జో బిడెన్ చేతిలో ఓటమిని మీడియా ప్రకటించిన ఒక రోజు తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఆదివారం వాషింగ్టన్ శివారులోని తన గోల్ఫ్ కోర్సులో మీడియాకు కనిపించారు. మాజీ వైస్ ప్రెసిడెంట్ కుటుంబ సభ్యులతో కలిసి డెలావేర్లో… విల్మింగ్టన్లోని తన ఇంటికి సమీపంలో ఉన్న ఒక కాథలిక్ చర్చిలో మాస్కుతో ఆయన హాజరు అయ్యారు. శనివారం వర్జీనియాలోని స్టెర్లింగ్‌లో తన కోర్సులో ట్రంప్ గోల్ఫ్ ఆడుకుంటున్నాడు.

ఓటమి తర్వాత ట్రంప్ ఎక్కువగా సోషల్ మీడియాలోనే కనిపించారు గాని ఎక్కడా పెద్దగా కనపడే ప్రయత్నం చేయలేదు. తనను అన్యాయంగా ఓడించారు అనే ఆరోపణలు ట్రంప్ పదే పదే చేస్తూ వచ్చారు. జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా బిడెన్ ప్రమాణ స్వీకారం చేస్తారు.