ఇండియాలో మైనార్టీ హక్కులపై US మీడియా ప్రశ్న.. మోదీ రియాక్షన్ ఏంటంటే..?

-

అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ వైట్​హౌస్​లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా యూఎస్ మీడియా మోదీని. ‘మైనార్టీల హక్కులను మెరుగుపరచడానికి భారత్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది..?’ అని ఓ పాత్రికేయుడు ప్రశ్నించాడు. దానికి ప్రధాని బదులిస్తూ.. ‘మీరు అడిగిన ప్రశ్న నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మనమంతా ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యం మన రక్తంలో నిండిపోయింది. దానినే మనం శ్వాసిస్తున్నాం. మానవ విలువలు, హక్కులు లేకపోతే.. ప్రజాస్వామ్యం అనేదే ఉండదు. మనం ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నప్పుడు.. వివక్ష అనే ప్రశ్నే ఉండదు’ అని ప్రధాని స్పష్టం చేశారు.

ఈ సమావేశానికి ముందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మీడియాతో మాట్లాడారు. ఆయన కూడా మైనార్టీ హక్కుల గురించి ప్రస్తావించారు. మోదీతో తనకు మాట్లాడే అవకాశమొస్తే .. మొదటగా భారత్​లోని మైనార్టీ హక్కుల గురించి ప్రస్తావిస్తానని చెప్పారు. ఎందుకంటే వాళ్ల హక్కులు పరిరక్షించలేకపోతే.. భారత్ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొనే అవకాశముందని తెలిపారు. మోదీతో భేటీలో.. బైడెన్​కూడా ఈ అంశాన్ని ప్రస్తావించాలి అని ఒబామా వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news