అమెరికా అధ్యక్షుడిగా బైడెన్‌ను తొలగించాలంటూ కమలా హారిస్‌కి అభ్యర్థన

-

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆయన జ్ఞాపకశక్తి, వయసు విషయంలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బైడెన్ దేశాధ్యక్షుడిగా వ్యవహరించడం ఇబ్బందికరమని పశ్చిమ వర్జీనియా అటార్నీ జనరల్‌ పాట్రిక్‌ మోరిసే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆయణ్ను పదవి నుంచి తొలగించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతూ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు లేఖ రాశారు.

ఇటీవల జరిగిన సమావేశాల్లో దేశాల పేర్ల విషయంలో బైడెన్ గందరగోళానికి గురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బైడెన్‌ జ్ఞాపక శక్తిలో మార్పును అమెరికన్లు చాలా కాలంగా గమనిస్తున్నారని పాట్రిక్ అన్నారు. బహిరంగ సభల్లో, విదేశీ నేతలతో సమావేశాల సమయంలోనూ ఈ విషయం స్పష్టంగా కనిపించిందని తెలిపారు. అధ్యక్షుడిగా కొనసాగడానికి ఆయన అర్హులుకారని అర్థమవుతోందని..  సీనియర్‌ నేతలు సైతం బైడెన్‌ వయసుపై విమర్శలు గుప్పిస్తున్నారని లేఖలో పాట్రిక్ పేర్కొన్నారు. ఈ మేరకు  25వ సవరణను అమలు చేసి.. ఆయనను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news