నగరవాసులకు గుడ్ న్యూస్…రూ. 5టిక్కెట్ తో 22కి.మీల హైస్పీడ్ జర్నీ..!

-

హైదరాబాద్ నగరవాసులకు మెట్రో కంటే ముందు నుంచి ఎంఎంటీఎస్ సేవలు అందిస్తుంది. మెట్రోలు అందుబాటులోకి వచ్చినా..ఎంఎంటీఎస్ జర్నీకి డిమాండ్ ఏమాత్రం తగ్గడం లేదు. మెట్రోలేని ప్రాంతాల్లో ఎంఎంటీఎస్ లు ప్రయాణికులకు గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. పైగా మెట్రోతో పోలిస్తే..వీటి ఛార్జీలు కూడా చాలా తక్కువే. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు..ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, కూలీలు ఇలా చాలా మంది నిత్యం ఎంఎంటీఎస్ లలో ప్రయాణిస్తుంటారు. అయితే ఈ రైళ్లు ఎక్కువగా లేవు. ఈక్రమంలో తాజాగా రక్షణ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవానికి గాను మార్చి మొదటివారంలో హైదరాబాద్ వస్తున్నారు. అదే రోజు సనత్ నగర్ మౌలాలి మధ్య మొత్తం 22 కిలోమీటర్ల మేర రెండో దశ ఎంఎంటీఎస్ రైళ్లను కూడా మోదీ ప్రారంభిస్తారు. సికింద్రాబాద్ ఘట్ కేసర్ లైన్ కూడా అదేరోజు ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. చర్లపల్లి స్టేషన్ ప్రారంభం అయ్యాక..అక్కడి నుంచి 25 ప్యాసింజర్ రైళ్లు దూరప్రాంతాలకు రాకపోకలను సాగించనున్నాయి. ఈ ట్రైన్లకు ప్రయాణికులను చేరవేయాలన్నా ఆయా స్టేషన్లలో దిగినవారిని నగరానికి తీసుకురావాలన్నా ఎంఎంటీఎస్ లు కీలకం. సనత్ నగర్ మౌలాలి లైనుతోనే ఇది సాధ్యం అవుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news